గోస్తనీ గట్టు జారుతోంది..!

ABN , First Publish Date - 2022-08-08T05:14:16+05:30 IST

డెల్టా ఆధునీకరణలో భాగంగా గోస్తనీ నది తవ్వ కాల పనులు వర్షం కాలం చేపట్టారు.

గోస్తనీ గట్టు జారుతోంది..!
పెనుమంట్ర వద్ద జారుతున్న గోస్తనీ గట్టు

పెనుమంట్ర, ఆగస్టు 7: డెల్టా ఆధునీకరణలో భాగంగా గోస్తనీ నది తవ్వ కాల పనులు వర్షం కాలం చేపట్టారు. కాల్వలో తొలగించిన మట్టి, చెత్త గట్టుపై వేశారు. వర్షాలకు గట్లు పలుచోట్ల గోస్తనీ నదిలోకి జారిపోతున్నాయి. కాల్వ వెంబడి కొబ్బరి చెట్లు సైతం పడిపోతున్నాయి. గట్టు వెంబడి నివాసం ఉంటున్న ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు. మూడు ప్యాకేజీల్లో కోటి 45లక్షలు ఖర్చుచేసి తవ్వకాలు చేపట్టినా మళ్లీ గట్టు కాల్వలోకి దిగిపో వడంతో ఇవేం పనులు అంటూ  రైతులు పెదవి విరుస్తున్నారు. తొలగించిన మట్టి, చెత్త వేరే ప్రాంతానికి తరలిస్తే బాగుండేదని, మరోసారి పెద్ద వర్షం కురిస్తే మట్టి తిరిగి కాల్వలో చేరుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. హడావుడిగా పనులు చేపట్టారని, వేసవిలో చేయాల్సిన పనులను వర్షాం కాలం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. గట్లు జారి పోతున్న ప్రాంతాల్లో పటిష్టం చేసే పనులు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - 2022-08-08T05:14:16+05:30 IST