గొట్టిపాటినగర్‌.. గోడు

ABN , First Publish Date - 2022-05-22T05:24:18+05:30 IST

మౌలిక వసతులు లేక గొట్టిపాటి నగర్‌ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గొట్టిపాటినగర్‌.. గోడు
ఇంటిముందు మురుగునీరు నిలబడకుండా కాలువలో పోసిన మట్టికుప్పలు

కాలనీ ఏర్పడి పాతికేళ్లయినా సమకూరని వసతులు

అస్తవ్యస్తంగా డ్రైనేజీ

 పట్టించుకోని పాలకులు

మార్టూరు, మే 21:  మౌలిక వసతులు లేక గొట్టిపాటి నగర్‌ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  1997లో మార్టూరు గ్రామ పంచాయతీ పరిఽఽధిలోని కొణిదెన రోడ్డులో గొట్టిపాటి నగర్‌ ఏర్పడింది. దాదాపుగా 23 ఎకరాల విస్తీర్ణంలో  500 మందికి పైగా పేదలకు ఒక్కొక్కరికి 3 సెంట్లు చొప్పున నివేశన ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. వారిలో సగం మంది పట్టాలను ఎపుడో అమ్ముకున్నారు. మిగిలినవారు ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఒక ప్లాట్‌ ధర రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతున్నది. కాలనీలో ఇంటి పట్టాలకు డిమాండు ఏర్పడింది. అయితే, ఇప్పటి వరకు కాలనీలో ప్రజలకు కావలసిన వసతులను సమకూర్చడంలో పాలకులు విఫలమయ్యారు. ప్రధానంగా కాలనీలో ఢ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్తంగా ఉంది.


ఎక్కడి మురుగు అక్కడే.. 

ఇళ్ల నుంచి బయటకు వచ్చిన మురుగునీరు సజావుగా వెళ్లే అ వకాశం లేదు. ఈ కాలనీలో కేవలం కొన్ని వీధులలో నిర్మించిన సైడుకాల్వలు ఎపుడో పూడిపోయాయి. మరి కొన్ని చోట్ల సైడుకాల్వలు పగిలిపోయాయి. దాంతో మురుగునీరు, వర్షపునీరు పారటానికి సైడుకాల్వలు లేకపోవడంతో ఇళ్ల ముందు అలాగే నిలిచిపోతున్నది. కొన్నిచోట్ల మురుగునీరు ఖాళీ ఇళ్ల స్థలాల్లో నిలబడిపోతున్నది.  కొంతమంది వారి ఇళ్ల ముందు మురుగునీరు నిలబడకుండా ఉండేం దుకు కాలువను మట్టికుప్పలతో ఏకంగా మూసివేశారు. దీంతో పలుమార్లు కాలనీవాసుల మధ్య తగాదాలు చోటుచేసుకుంటున్నాయి. గ్రామ పంచాయతీ వారు మురుగునీరు నిలబడకుండా చర్యలు చేప ట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.


అధికారులు పట్టించుకోవడంలేదు

- షేక్‌ అబ్దుల్‌ కరీం గొట్టిపాటి నగర్‌

ఎంతో కాలం క్రితం ఇంటిని నిర్మించుకున్నాం, సిమెంటురోడ్డు సంగతి దేవుడెరుగు, మా ఇళ్ల ముందు, మావీఽధిలో మురుగునీరు  నిలబడకుండా చూడాలి సైడుకాల్వలు మూసుకుపోయాయి. ఇళ్లలో ఉండలేకపోతున్నాం. అఽఽధికారులు కాలనీని పరశీలించి తమ ఇబ్బం దులు తొలగించాలి.


Updated Date - 2022-05-22T05:24:18+05:30 IST