
Amaravathi: టీడీపీ (TDP) నేత గౌతు శిరీష (Gouthu Sireesha) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan reddy) సంక్షేమ పథకాలను కత్తెర పథకాలుగా మార్చారని ఆరోపించారు. అమ్మ ఒడి దగ్గర నుంచి మొదలు కొని చివరకు దళితులకు ఇచ్చే విద్యుత్ రాయితీల్లో కూడా ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించడం రాజద్రోహం కిందకు రాదన్నారు. చంద్రబాబు మీద అబద్ధ ప్రచారం చేసి జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ఈ ప్రభుత్వం నిలిపివేసిందని, అన్ని వర్గాల వారిని జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని గౌతు శిరీష తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఇవి కూడా చదవండి