గోవాడ షుగర్స్‌ క్రషింగ్‌ 7కి వాయిదా

ABN , First Publish Date - 2020-12-03T05:29:19+05:30 IST

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ క్రషింగ్‌ ఈ నెల 7వ తేదీకి వాయిదా పడింది. క్రషింగ్‌ గురువారం ప్రారంభించాల్సి ఉండగా, ఓవరాలింగ్‌ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో మరో మూడు రోజులు వాయిదా వేశారు.

గోవాడ షుగర్స్‌ క్రషింగ్‌ 7కి వాయిదా
గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ

చోడవరం, డిసెంబరు 2: గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ క్రషింగ్‌ ఈ నెల 7వ తేదీకి వాయిదా పడింది. క్రషింగ్‌ గురువారం ప్రారంభించాల్సి ఉండగా, ఓవరాలింగ్‌ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో మరో మూడు రోజులు వాయిదా వేశారు. 7వ తేదీ తెల్లవారు 5 గంటల 21 నిమిషాలకు క్రషింగ్‌ ముహూర్తం ఖరారు చేసినట్టు ఫ్యాక్టరీ ఎండీ సన్యాసినాయుడు తెలిపారు. ఈ సీజన్‌లో నాలుగున్నర లక్షల టన్నుల చెరకు క్రషింగ్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

Updated Date - 2020-12-03T05:29:19+05:30 IST