Governor Ravi's statement: చేత తుపాకీలు పట్టేవారికి వాటితోనే సమాధానం

ABN , First Publish Date - 2022-08-02T15:18:34+05:30 IST

దేశంలో ఉగ్రవాదం అణగారి పోయిందని, ఈశాన్య రాష్ట్రాల్లో కశ్మీర్‌లోనూ తీవ్రవాద చర్యలు కూడా బాగా తగ్గిపోయాయని, ఈ పరిస్థితుల్లో చేత తుపాకీలు

Governor Ravi's statement: చేత తుపాకీలు పట్టేవారికి వాటితోనే సమాధానం

                                  - కొచ్చిన్‌ సదస్సులో గవర్నర్‌ వ్యాఖ్య


చెన్నై, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఉగ్రవాదం అణగారి పోయిందని, ఈశాన్య రాష్ట్రాల్లో కశ్మీర్‌లోనూ తీవ్రవాద చర్యలు కూడా బాగా తగ్గిపోయాయని, ఈ పరిస్థితుల్లో చేత తుపాకీలు పట్టుకుని హింసకు పాల్పడేవారికి తుపాకులతోనే సమాధానం చెబుతామని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(State Governor RN Ravi) అన్నారు. కేరళ రాష్ట్రం కొచ్చిన్‌(Cochin)లో మానవహక్కుల సంఘం ఆధ్వర్యంలో ‘దేశభద్రత - ప్రస్తుత సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో అంతర్గత భద్రత మరింత పటిష్ఠమైందని, ఉగ్రవాద చర్యల కారణంగా సామాన్య పౌరులు, సైనికవీరులు మృతిచెందే సంఘటనలు కూడా తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలంతా ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, గతంలో హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. ఎనిమిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సాయుధ ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి చర్చలు, సంప్రదింపులు జరపలేదని అన్నారు. భవిష్యత్‌లోనూ ఉగ్రవాద(terrorism) సంస్థలతో చర్చలు జరిపే అవకాశాలే లేవని, లొంగుబాటుకు సిద్ధమయ్యేవారితోనే చర్చలు జరుపుతుందన్నారు. తుపాకులు చేతపట్టేవారికి తుపాకులతో సమాధానం చెప్పేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ముంబయి(Mumbai)లో ఉగ్రవాదులు దాడులు జరిపిన తర్వాత అప్పటి ప్రధాని పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని, పాకిస్థాన్‌ స్నేహపూర్వక దేశమా? లేక శత్రుదేశమా? అని తేల్చుకోలేని అయోమయ పరిస్థితుల్లో ఆ ఒప్పందం కుదుర్చుకున్నారని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి విమర్శించారు.

Updated Date - 2022-08-02T15:18:34+05:30 IST