ఉపాధి అవకాశాలకు మార్గం చూపించాలి

ABN , First Publish Date - 2022-04-26T12:52:26+05:30 IST

ప్రతి యేటా దేశ వ్యాప్తంగా 70 శాతం మంది విద్యార్థులు ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌ విభాగాల్లో పట్టభద్రులవుతున్నారని, వారందరూ ఉపాధి అవకాశాలు పొందడంలో తీవ్ర

ఉపాధి అవకాశాలకు మార్గం చూపించాలి

                       - వీసీల సదస్సులో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి 


అడయార్‌(చెన్నై): ప్రతి యేటా దేశ వ్యాప్తంగా 70 శాతం మంది విద్యార్థులు ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌ విభాగాల్లో పట్టభద్రులవుతున్నారని, వారందరూ ఉపాధి అవకాశాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పేర్కొన్నారు. వీరికి ఉపాధి అవకాశాలు లభించేలా అడకమిట్‌ సొసైటీ సీరియ్‌సగా దృష్టిసారించాలని వీసీలకు సూచించారు. నీలగిరి జిల్లా ఊటీలో రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చెందిన ఉపకులపతుల సదస్సును ఆయన సోమవారం ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ‘ఇండియా టు బి ది వరల్డ్‌ లీడర్‌ 2017’ అనే అంశంపై నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో యూనియన్‌ గ్రాంట్స్‌ కమిషనర్‌ ఛైర్మన్‌ ఎం.జగదీష్‌ కుమార్‌, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్‌ ఛాన్సలర్లు పాల్గొన్నారు. ఈ సదస్సులో గవర్నర్‌ మాట్లాడుతూ... దేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్స వేడుకలను పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ జరుపుకుంటుందన్నారు. ఇలాంటి తరుణంలో చరిత్రాత్మక సదస్సును నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ రెండు రోజుల సదస్సులో అనేక కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలపై విపులంగా చర్చ జరుగుతుందన్నారు. ముఖ్యంగా 2014 తర్వాత దేశ ప్రగతి కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. పట్టభద్రులుగా ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు సరైన ఉపాధి అవకాశాలు లభ్యమయ్యేలా అధ్యయనం జరగాలని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పిలుపునిచ్చారు., 

Updated Date - 2022-04-26T12:52:26+05:30 IST