Governor: ఉన్నత విద్య పునాదులు పటిష్ఠం

ABN , First Publish Date - 2022-08-05T12:59:21+05:30 IST

రాష్ట్రంలో ఉన్నత విద్య పునాదులు ఎంతో పటిష్ఠంగా ఉన్నాయని గవర్నర్‌(Governor) ఆర్‌ఎన్‌ రవి పేర్కొన్నారు. నగరంలో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన

Governor: ఉన్నత విద్య పునాదులు పటిష్ఠం

                                  - గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి 


అడయార్‌(చెన్నై), ఆగస్టు 4: రాష్ట్రంలో ఉన్నత విద్య పునాదులు ఎంతో పటిష్ఠంగా ఉన్నాయని గవర్నర్‌(Governor) ఆర్‌ఎన్‌ రవి పేర్కొన్నారు. నగరంలో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ... ఎన్‌ఐఆర్‌ఎస్ ర్యాంకుల జాబితాలో టాప్‌-10లో రాష్ట్రానికి చెందిన విద్యా సంస్థలకు స్థానం దక్కడం గొప్ప విషయమన్నారు. ఈ విషయంలో అన్ని ఉన్నత విద్యా సంస్థల అధిపతులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. టాప్‌-20 ర్యాంకులను తీసుకున్నప్పటికీ అందులో కూడా రాష్ట్ర వాటా అధికంగా ఉందన్నారు. ఎన్‌ఐఆర్‌ఎ్‌స ర్యాంకుల్లో చోటు దక్కని విద్యా సంస్థలు అందులో స్థానం సంపాదించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేసమయంలో ర్యాంకులో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటే దాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నించాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మద్రాస్‌ ఐఐటీ(Madras IIT), సాంకేతిక విద్యామండలి ప్రత్యేక గుర్తింపు పొందాయన్నారు. అందువల్ల ఈ రెండు విద్యా సంస్థలు కలిసి పనిచేయాలని గవర్నర్‌(Governor) సూచించారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉన్నత విద్యాశాఖామంత్రి డాక్టర్‌ పొన్ముడి(State Higher Education Minister Dr. Ponmudi) మాట్లాడుతూ... జాతీయ స్థాయిలో ఉన్నత విద్య అభ్యసించే రాష్ట్ర విద్యార్థుల సంఖ్య 53 శాతానికి పెరిగినట్టు ఎన్‌ఐఆర్‌ఎస్ అధ్యయనం ద్వారా వెల్లడైందన్నారు. అందుకే దేశంలో ఉన్నత విద్యలో మన రాష్ట్రం మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందన్నారు. తొలి వెయ్యి సంస్థల్లో 163 విద్యా సంస్థలు రాష్ట్రానికి చెందినవేనని తెలిపారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగు కోసం ఏకంగా రూ.42 వేల కోట్లు కేటాయించగా, మహిళా విద్య కోసం రూ.1000 కోట్లు కేటాయించారని మంత్రి పొన్ముడి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రహ్మణ్యం, ఉన్నత విద్య శాఖ కార్యదర్శులు తదితరులు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-05T12:59:21+05:30 IST