రాజ్‌భవన్‌లో మూలుగుతున్న ఐదు బిల్లులు

ABN , First Publish Date - 2022-03-20T13:29:27+05:30 IST

రాష్ట్రానికి చెందిన ఐదు బిల్లులు రాజ్‌భవన్‌లో మూలనపడిపోయాయి. గవర్నర్‌ చల్లటి చూపుల కోసం అవి వేనోళ్ల ఎదురు చూస్తున్నాయి. తమకు గవర్నర్‌ ఎప్పుడు మోక్షం

రాజ్‌భవన్‌లో మూలుగుతున్న ఐదు బిల్లులు

                    - గవర్నర్‌ ఆమోదం కోసం పడిగాపులు


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రానికి చెందిన ఐదు బిల్లులు రాజ్‌భవన్‌లో మూలనపడిపోయాయి. గవర్నర్‌ చల్లటి చూపుల కోసం అవి వేనోళ్ల ఎదురు చూస్తున్నాయి. తమకు గవర్నర్‌ ఎప్పుడు మోక్షం ప్రసాదిస్తారోనని వేచివున్నాయి. గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌లో ఐదు చట్టతీర్మానాలు పెండింగ్‌లో వున్నాయి. రాష్ట్ర శాసనసభలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త చట్టాలు, లేదా చట్ట సవరణలు చేస్తూ బిల్లులు దాఖలుచేస్తారు.. ఈ బిల్లును ఆమోదించి, గవర్నర్‌ ఆమోదం కోసం గవర్నర్‌కు పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం అవసరమైన బిల్లులను రాష్ట్రపతి దృష్టికి గవర్నర్‌ తీసుకెళతారు. అలా గవర్నర్‌ ఆమోదం కోసం పంపిన ఐదు బిల్లులు రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో మూలుగుతున్నాయి. గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో వున్న బిల్లులివే.. ఫ పత్రాల రిజిస్ట్రేషన్‌ తమిళనాడు సవరణ చట్టం బిల్లు-2021. గత ఏడాది సెప్టెంబరు 2వ తేది శాసనసభలో ఆమోదించారు.


 - పత్రాల రిజిస్ట్రేషన్‌ తమిళనాడు 2వ సవరణ చట్ట బిల్లు-2021. ఈ చట్ట బిల్లులు గత ఏడాది సెప్టెంబరు 2వ తేది శాసనసభలో ఆమోదించారు.

- భారతియార్‌ విశ్వవిద్యాలయ సవరణ చట్టం బిల్లు-2021 గత ఏడాది సెప్టెంబరు 13వ తేదీన పంపారు.

- సహకార సంఘాల చట్టాలు 2వ సవరణ చట్ట బిల్లు గత జనవరి 8వ తేది శాసనసభలో ఆమోదించారు.

- నీట్‌ పరీక్షకు మినహాంపు, తమిళనాడు యూజీ వైద్య విద్యలో విద్యార్థుల అడ్మిషన్‌ చట్ట బిల్లు-2021, ఇదివరకే శాసనసభలో గత ఏడాది సెప్టెంబరు 13న శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్‌ ఆమోదానికి పంపారు. 

Updated Date - 2022-03-20T13:29:27+05:30 IST