ఈద్‌ మిలాప్‌ వేడుకలకు హాజరైన దత్తాత్రేయ

Jul 23 2021 @ 00:59AM

అమీర్‌పేట, జూలై 22 (ఆంధ్రజ్యోతి): బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎఫ్‌.ఎ్‌స.లాయక్‌ అలీ ఆధ్వర్యంలో గురువారం అమీర్‌పేటలో నిర్వహించిన ఈద్‌ మిలాప్‌ వేడుకలకు హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడ పిల్లలు, ముఖ్యంగా మైనార్టీ బాలికల్లో అక్షరాస్యత శాతం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కలిసి మెలిసి పండుగలు జరుపుకోవాలని, శాంతి సామరస్యాలతో మెలగాలని సూచించారు. అంతకుముందు ఆయన బక్రీద్‌ విందులో పాల్గొని సహఫంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బూర్గుల శ్యాంసుందర్‌గౌడ్‌, గౌతంరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, అమీర్‌పేట కార్పొరేటర్‌ కేతినేని సరళ, బీజేపీ నగర సహ కోశాధికారి ఎఫ్‌.ఎస్‌. ఆదమ్‌ అలీ, జిల్లా సోషల్‌ మీడియా ఇన్‌చార్జి రాకేష్‌, తదితరులు పాల్గోన్నారు. అనంతరం దత్తాత్రేయను మైనారిటీ మోర్చా నాయకులు, బీజేపీ నేతలు సన్మానించారు.

Follow Us on: