ప్రభుత్వం మారితే.. కాలనీలకు కరెంట్‌ ఇవ్వరా..

ABN , First Publish Date - 2022-06-26T07:12:56+05:30 IST

మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లి ఇందిరమ్మకాలనీలో టీడీపీ హయాంలో పేదలకు అం దించిన ఇళ్లకు కరెంట్‌ ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంభిస్తోందని, వల్లవేములపల్లికి చెందిన 685 మంది, జెడ్‌.మేడ పాడుకు చెందిన 25 మంది కాలనీవాసులు ఇళ్లు నిర్మించుకుని రెండున్నరేళ్ల నుంచి అంధకారంలో ఉంటున్నారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆరోపించారు.

ప్రభుత్వం మారితే.. కాలనీలకు కరెంట్‌ ఇవ్వరా..
వేములపల్లికాలనీలో టీడీపీ హయాంలో ఇచ్చిన ఇళ్లకు విద్యుత్‌ ఇవ్వలేదని కాలనీవాసులు ఎమ్మెల్యే వేగుళ్లకు విన్నవించుకుంటున్న దృశ్యం

వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే వేగుళ్ల మండిపాటు

మండపేట, జూన్‌ 25 : మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లి ఇందిరమ్మకాలనీలో టీడీపీ హయాంలో పేదలకు అం దించిన ఇళ్లకు కరెంట్‌ ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంభిస్తోందని, వల్లవేములపల్లికి చెందిన 685 మంది, జెడ్‌.మేడ పాడుకు చెందిన 25 మంది కాలనీవాసులు ఇళ్లు నిర్మించుకుని రెండున్నరేళ్ల నుంచి అంధకారంలో ఉంటున్నారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అభివృద్ధి, మౌలిక వసతుల విషయంలో పార్టీలకు అతీతంగా, వివక్ష లేకుండా చేయాలేతప్ప కక్షపూరిత వైఖరి అవలంభించడం తగదన్నారు. శని వారం సాయంత్రం వేగుళ్ల కాలనీవాసుల సమస్యలను అడిగి తెలు సుకున్నారు. కాలనీవాసులు కరెంట్‌లేక పోవడం వల్ల కాపురాలు ఉండలేకపోతున్నామని ఎమ్మెల్యే వేగుళ్ల ముందు వాపోయారు. దీం తో కాలనీవాసులకు విద్యుత్‌కోసం వేగుళ్ల విద్యుత్‌శాఖ ఉన్నతాధికా రులతో మాట్లాడారు. కాలనీవాసులకు నెలరోజుల్లో కరెంట్‌ ఇప్పించే బాధ్యత తీసుకుంటానని వేగుళ్ల భరోసా ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కాలనీవాసులు విద్యుత్‌ సమస్యపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మండపేటలో కాం గ్రెస్‌ పాలనలో నిర్మించి వదిలేసిన రాజీవ్‌గృహకల్ప 408 ఇళ్ల సము దాయాన్ని టీడీపీ హయాంలో ఉచితంగా నిర్మించి ఇచ్చిన ఘనత తమదేనన్నారు. అలాగే ద్వారపూడిలో ఫ్లైఓవర్‌కు పునాది రాయివేసి వంతెన మధ్యలో వదిలేస్తే టీడీపీ ప్రభుత్వంలో పూర్తి చేసి చంద్ర బాబు ప్రారంభించిన విషయాన్ని వేగుళ్ల గుర్తుచేశారు. వేములపల్లి కాలనీకి కరెంట్‌, మౌలిక వసతులు సత్వరమే కల్పించాలని, లేకుంటే కాలనీవాసులతో కలిసి ప్రభుత్వంపై పోరాడటానికి కూడా వెనకాడ బోనని వేగుళ్ల హెచ్చరించారు. ఆయన వెంట టీఎన్‌టీయూసీ రాష్ట్రా ధికార ప్రతినిధి వాదా ప్రసాదరావు, జెడ్‌.మేడపాడు సర్పంచ్‌ కంచర్ల చంద్రశేఖర్‌,  ఏఎంసీ మాజీ చైర్మన్‌ చేకూరి రమేష్‌ రాజు, నాయకు లు గోణం పుల్లయ్య, సలాది సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.




Updated Date - 2022-06-26T07:12:56+05:30 IST