రైతులను నిండా ముంచిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-05-22T05:27:30+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు అన్ని విధాలు గా అన్యాయం చేస్తూ నిండా ముంచిందని టీడీపీ మండల అధ్యక్షుడు కఠారి నాగేశ్వరరావు అ న్నారు.

రైతులను నిండా ముంచిన ప్రభుత్వం
అద్దంకి: జార్లపాలెంలో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నేతలు

 టీడీపీ నేతల ధ్వజం

అద్దంకి,  మే 21:  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు అన్ని విధాలు గా అన్యాయం  చేస్తూ నిండా  ముంచిందని  టీడీపీ మండల అధ్యక్షుడు కఠారి నాగేశ్వరరావు అ న్నారు. మండలంలోని జార్లపాలెంలో శనివారం సాయంత్రం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా  ఎన్టీఆర్‌ విగ్రహానికి  పూలమాలలు వేసి  నివాళులర్పించారు. అనంతరం  ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు జరిగిన నష్టాన్ని వివరించారు. ఈ సందర్భంగా  నాగేశ్వరరావు  మాట్లాడుతూ ఎడాపె డా విద్యుత్‌ కోతలు విధించ ంతో పాటు విద్యుత్‌ చార్జీలు ఇష్టాను సారం పెంచారన్నారు. పండించిన ధాన్యం కు ధరలు  లేకపోవటంతో రైతులు తీ వ్రంగా ఇబ్బంది పడ్డారన్నారు. సుబాబుల్‌ కు  మంచి ధర కల్పిస్తానని  పాదయాత్రలో మాట ఇచ్చిన  సీఎం జగన్మోహనరెడ్డి ఇప్పుడు  గాలికి వదిలివేశారన్నారు. 

కార్య క్రమంలో టీడీపీ  నేతలు కరి పరమేష్‌, మలాది నటరాజ్‌, చాగంటి  రాజేంద్ర, జొన్నలగడ్డ గోపి, ధూళిపాళ్ళ వీరాస్వామి, భార్గం, సు బ్రహ్మణ్యం, నాగయ్య, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.


నేడు 7వ వార్డులో..

అద్దంకి, మే 21: వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను  నిరసిస్తూ ఆదివారం  టీ డీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు నిర్వహి స్తున్నట్టు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు చిన్ని శ్రీనివాసరావు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు  స్థానిక 7 వ వార్డు పరిధిలో ఈ కార్యక్ర మం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.


 పన్నుల భారంతో తల్లడిల్లుతున్న ప్రజలు

పంగులూరు, మే 21: పన్నుల భారంతో ప్రజలు తల్లడిల్లుతున్నా  పాలకులు పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రప్రభుత్వం పెంచిన విద్యుత్‌, బస్‌ చార్జీలు, ఆకా శాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ  శనివారం గ్రామంలో ర్యాలీ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. 

కార్యక్రమంలో  టీడీపీ మండల అధ్యక్షుడు రావూరి రమేష్‌,  మాజీ జడ్పీటీసీ కేవీ సుబ్బారావు, మాజీ సర్పంచ్‌ తొట్టెంపూడి చంద్రశేఖర్‌, కుక్కపల్లి ఏడుకొండలు, చింతల సహదేవుడు, బెల్లంకొండ దశరధ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T05:27:30+05:30 IST