గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2022-05-24T07:11:36+05:30 IST

నేరేడుగొ మ్ము మండలంలో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చే స్తుందని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు.

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
పేర్వాలలో సీసీరోడ్డు పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రవీంద్ర

 ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ 

నేరేడుగొమ్ము, మే 23: నేరేడుగొ మ్ము మండలంలో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చే స్తుందని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు. సోమవారం నేరేడుగొమ్ము మండలం పేర్వాల, ధర్మరేక్యతండా, కొత్తపల్లి, పందిరిగుండుతండా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. పేర్వాలలో రూ.5 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. అనంతరం రూ.8 లక్షలతో నిర్మించిన అంగనవాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. కొత్తపల్లి గ్రామంలో మన ఊరు, మనబడి కార్యక్రమంలో భాగంగా రూ.13 లక్షల 67 వేలు, పందిరిగుండులలో రూ.11.45 లక్షలు, పలుగుతండాలో రూ.6.62 లక్షలతో పాఠశాలల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బానావత పద్మ హనుమానాయక్‌, జడ్పీటీసీ బాలు, వైస్‌ఎంపీపీ ఆరేకంటి ముత్యాలమ్మ, సింగిల్‌విండో చైర్మన చిన బాలయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, ఎంపీడీవో ఝాన్సీలక్ష్మీబాయి, సీడీపీవో అనురాధ, సర్పంచులు కతిజాబషీర్‌, సీతారాం, చెన్నానాయక్‌, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-24T07:11:36+05:30 IST