రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2022-09-28T06:29:58+05:30 IST

రైతుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే అన్నా.రాంబాబు పేర్కొన్నారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
డ్రిప్పు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు

ఎమ్మెల్యే అన్నా రాంబాబు

గిద్దలూరు టౌన్‌, సెప్టెంబరు 27 : రైతుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే అన్నా.రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు, ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్‌యార్డు లో రైతులకు డ్రిప్‌, స్ర్పింక్లర్లు మంజూరు కాగా ఆయన వారికి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. సబ్‌డివిజన్‌ పరిధిలో 37 మంది రైతులకు రూ.36.45 లక్షల విలువైన స్ర్పింక్లర్లు, డ్రిప్‌లను అందిస్తుందన్నారు. సుమారు 40.81 హెక్టార్లలో వీటిని అమర్చుకుని రైతులు సాగు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, వైస్‌ చైర్మన్‌ ఆర్‌.డి.రామకృష్ణ వైసీపీ నాయకులు కడప వంశీధర్‌రెడ్డి, దేమా.శ్రీరాములు, కావేటి ఈశ్వర్‌, ఏపీఎంఐడీ పీడీ  బి.రవీంద్రబాబు, ఉద్యానవన శాఖాధికారి శ్వేత, ఎంఐడీసీ ఓబయ్య, ఎంఐ జేఏవో మోహన్‌రావు, ఎంఐ కంపెనీ డీఎస్‌వో అమరేందర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, రాజేంద్రప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

కులమతాలకు అతీతంగా నేడు ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని ఎమ్మెల్యే అన్నా.రాంబాబు తెలిపారు. మంగళవారం క్లబ్‌ రోడ్డు సచివాలయం పరిధిలోని 8వ వార్డులో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని కొత్తకోట గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే దివ్యాగుడికి వీల్‌చైర్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, వైస్‌చైర్మన్లు ఆర్‌.డి.రామక్రిష్ణ, కాతా దీపిక, కోఆప్షన్‌ సభ్యులు దమ్మాల జనార్థన్‌, షేక్‌ మస్తాన్‌వలి, కమిషనర్‌ రామకృష్ణయ్య పాల్గొన్నారు.

చేయూత చెక్కుల పంపిణీ

బేస్తవారపేట : మండలంలోని పేదలైన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత చెక్కులను మంగళవారం  మండల పరిషత్‌ కార్యలయం వద్ద గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడివో ఎస్‌.చెన్నకేశవరెడ్డి,  ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు వెంకటరాజయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-09-28T06:29:58+05:30 IST