మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2022-10-02T04:55:18+05:30 IST

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కందుకూరు: బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న సర్పంచ్‌ కళమ్మరాజు

కేశంపేట/కందుకూరు/చౌదరిగూడ/షాబాద్‌/ఆమనగల్లు, అక్టోబరు 1: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేశంపేట ఎంపీపీ రవీందర్‌ యాదవ్‌ అన్నారు. కేశంపేట మండలంలోని కాకునూర్‌, తొమ్మదిరేకులు, లింగంధన, నిర్థవెల్లి, లేమామిడి, బొదునంపల్లి గ్రామాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.  జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రావణ్‌రెడ్డి, సర్పంచులు గండ్ర లక్ష్మమ్మ, సావిత్రిబాల్‌రాజ్‌గౌడ్‌, నాగిళ్ల ప్రతాప్‌, పార్వతమ్మ, శ్రీశైలంగౌడ్‌, కళమ్మ, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ నారాయణరెడ్డి, మాజీ వైస్‌చైర్మన్‌ వర్కాల లక్ష్మీనారాయణగౌడ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ గండ్ర జగదీశ్వర్‌గౌడ్‌, మురళీధర్‌రెడ్డి, మధుసూదన్‌గౌడ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా కందుకూరులోని ఆకుల మైలారంలో సర్పంచ్‌ జి.కళమ్మరాజు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఎంపీటీసీ అచ్చన్న పద్మపాండు పాల్గొన్నారు. అదేవిధంగా చౌదరిగూడ మండలంలోని ఎదిర గ్రామంలో సర్పంచ్‌ రాపోల్‌ బాల్‌రాజ్‌, ఎంపీటీసీ సత్యప్రమోద్‌రావులు చీరలు పంపిణీ చేశారు. షాబాద్‌లోని ఎర్రోనిగూడలో ముద్దెంగూడ సర్పంచ్‌ కుర్వ జయమ్మసుదర్శన్‌, ఉపసర్పంచ్‌ సామ ప్రతా్‌పరెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అదేవిధంగా ఆమనగల్లు మున్సిపాలిటీలోని సంకటోనిపల్లిలో 8వ వార్డు కౌన్సిలర్‌ రాధమ్మ వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామ్‌ సుందర్‌ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జైపాల్‌, లింగయ్య, చంద్రమౌళి, మంజుల, చంద్రకళ, యాదమ్మ, కృష్ణవేణి, మణేమ్మ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-02T04:55:18+05:30 IST