క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం

ABN , First Publish Date - 2022-08-18T05:33:52+05:30 IST

క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం

క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం
విజేతలకు ఫ్రీడం కప్‌ను అందజేస్తున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు/షాద్‌నగర్‌, ఆగస్టు 17: రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని రకాలుగా ప్రోత్సాహాన్సిస్తోందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల సమీప ఫార్చ్యూన్‌ బటర్‌ ఫ్లై సిటీ గ్రౌండ్‌లో బుధవారం ‘వజ్రోత్సవ్‌.. ద్విసప్తా్‌హ’లో భాగంగా ఫ్రీడం కప్‌ పోటీలు నిర్వహించారు. ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి, మాడ్గుల మండలాల ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థులు 520మంది వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు ఎమ్మెల్సీ హాజరై క్రీడాకారులకు ఫ్రీడం కప్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో సర్దార్‌నాయక్‌, జిల్లా ఎంపీటీసీల సంఘం గౌరవా ధ్యక్షుడు జి.శ్రీనివా్‌సరెడ్డి, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు జి.లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, హెచ్‌ఎం.జంగయ్య, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మనాయక్‌, నాయకులు, ప్రతినిధులు నరేశ్‌నాయక్‌, అరవింద్‌, రమేశ్‌, సంజీవ్‌, శేఖర్‌గౌడ్‌, శ్రీను, సురేందర్‌రెడ్డి, ట్రైనర్లు చంద్రమోహన్‌, జ్యోత్స్న, సుశీల, భీముడు, పరమేశ్‌, రేణుక, ప్రసాద్‌, వెంకటేశ్‌, రమేశ్‌, మల్లేశ్‌, యాదగిరి, రామచంద్రుడు, కృష్ణ, అశోక్‌ పాల్గొన్నారు. క్రీడలు శారీరక దృ ఢత్వానికి దోహదపడుతాయని షాద్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌ అన్నారు. పట్టణంలోని మినీ స్టేడియంలో క్రీడలను ఆయన ప్రారంభించారు. చైర్మన్‌ మాట్లాడుతూ క్రీడలను నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. క్రీడల్లో రాణిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. పట్టణ సీఐ నవీన్‌కుమార్‌, జడ్పీటీసీ వెంకట్‌రామ్‌రెడ్డి, ఎంపీపీ ఇద్రీస్‌, ఎంపీడీవో వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T05:33:52+05:30 IST