కరోనా నియంరత్రణలో ప్రభుత్వం విఫలం : టీడీపీ

ABN , First Publish Date - 2021-05-09T04:54:39+05:30 IST

రాష్ట్రంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో వైఎస్‌జగన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బద్వేలు, మై దుకూరు తెలుగుయువత నేతలు విమర్శించారు.

కరోనా నియంరత్రణలో ప్రభుత్వం విఫలం : టీడీపీ
బద్వేలులో నిరసన వ్యక్తం చేస్తున్న కొలవళి వేణుగోపాల్‌ -

బద్వేలు,/మైదుకూరు రూరల్‌, మే 8: రాష్ట్రంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో వైఎస్‌జగన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బద్వేలు, మై దుకూరు తెలుగుయువత నేతలు విమర్శించారు. అధికార ప్రతినిధి వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో స్థాని క కార్యాలయంలో  ఉదయం 11 గంటల నుంచి 12వరకు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశా రు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు 18 నుంచి 45 ఏళ్ల వారందరికీ జగన సర్కారు కరోనా వ్యాక్సిన ఇచ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్‌ చేశారు.

కరోనా వ్యాక్సిన కొనుగోలు కోసం దేశంలోని అనేక రాష్ర్టాలు పోటీపడు తుంటే మన ముఖ్యమంత్రి కేంద్రం సరఫరా చేసే వ్యాక్సినలపైనే ఆధారపడడం దారుణమన్నారు. రా ష్ట్రంలో మొదటి డోసు 10 శాతం మందికి వేస్తే రెండో డోసు కేవలం మూడు శాతం మందికి వేశారని  దీంతో రెండో డోసు వేసుకోవాల్సిన వారిలో తీవ్ర ఆందోళన మొదలైందన్నారు.

తెలుగు యువత జిల్లా కార్యనిర్వాహణ కార్య దర్శి పుష్పరాజు, బీసీ సేవాసంఘం బద్వేలు నియోజక వర్గ అధ్యక్షుడు గంటా వెంకటయ్య యాదవ్‌  తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర టీడీపీ మైనార్టీ కార్పొరేషన మాజీ డైరెక్టర్‌ ఎస్‌. మహబూబ్‌బాష నివాస గృహంలో  నిరసన చేపట్టారు. 

 మైదుకూరు మండల తెలుగు యువత అధ్యక్షుడు నేట్లపల్లి శివరామక్రిష్ణ నిరసన తెలిపారు. పెద్దశెట్టిపల్లెలోని శివరామక్రిష్ణ నివాసంలో కరోన నివా రణ చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోం దని మండిపడ్డారు. కార్యక్రమంలో సంబటూరు సురేష్‌, రఘునాధ్‌ పాల్గొన్నారు.



Updated Date - 2021-05-09T04:54:39+05:30 IST