పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి

ABN , First Publish Date - 2021-06-17T05:42:28+05:30 IST

పల్లెలు, పట్టణాలు అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం దృష్టి సారించింద ని రాష్ట్ర పంచాయతీరాజ్‌,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.

పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, ఇతర అధికారులు

- సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి 

- వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పెద్దపల్లిటౌన్‌, జూన్‌ 16: పల్లెలు, పట్టణాలు అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం దృష్టి సారించింద ని రాష్ట్ర పంచాయతీరాజ్‌,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. సీఎస్‌, ఉన్నతాధికారులు, కలెక్టర్లతో బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌లో పలు సూచనలు సలహా లు ఇచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో పల్లెప్రగతి, పట్టణప్రగతి నిరంతరం కొనసాగించాలని సూ చించారు. ప్రజలను బాగస్వామ్యం చేస్తూ తడి చెత్త,పొడి చెత్త వేరుగా సేకరించాలని, హరిత హారంలో భాగంగా ప్రభుత్వం సూచించిన స్థ లాల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షణ చర్య లు తీసుకోవాలని సూచించారు. వైకుంఠధామా ల పనులు వెంటనే పూర్తిచేయాలని, వాటిలో గ్రీనరీ కోసం చర్యలు చేపట్టాలని ఆయన పే ర్కొన్నారు. సీజనల్‌ వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారుల పల్లె నిద్ర చేపట్టి స్థానికంగా నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. ము న్సిపాల్టీకు కేటాయిస్తున్న పది శాతం నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మిషన్‌ భగీ రథ ద్వారా తాగు నీరందించేందుకు అధికారు లు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకో వాలన్నారు. ప్రత్యేక ఆహారం శుద్ధి కోసం జిల్లా కు పది ఎకరాల స్థలాన్ని గుర్తించి రెండు రోజు ల్లో ప్రక్రియ పూర్తిచేయాలని ఆయన అధికారు లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ సంగీతసత్యనారా యణ, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కు మార్‌ దీపక్‌, ఉదయ్‌కుమార్‌, ప్రమోద్‌కుమార్‌, శ్రీధర్‌తో పాటు ఇతర అధిరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T05:42:28+05:30 IST