బిల్లులు ఇవ్వలేకపోయిన మాట వాస్తవమే

ABN , First Publish Date - 2022-06-26T05:23:15+05:30 IST

వివిధ అభివృద్ధి పనులు చేసిన కాంట్రా క్టర్లకు సకాలంలో బిల్లులు ఇవ్వలేకపోయిన మాట వాస్తవమేనని, కేంద్రం నుంచి నిధులు సక్రమంగా రాకపోవడంతోనే జాప్యం జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు.

బిల్లులు ఇవ్వలేకపోయిన మాట వాస్తవమే

ప్లీనరీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 


డోన్‌, జూన్‌ 25: వివిధ అభివృద్ధి పనులు చేసిన కాంట్రా క్టర్లకు సకాలంలో బిల్లులు ఇవ్వలేకపోయిన మాట వాస్తవమేనని, కేంద్రం నుంచి నిధులు సక్రమంగా రాకపోవడంతోనే జాప్యం జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. డోన్‌ పట్టణంలోని మంత్రి బుగ్గన ఇంటి సమీపంలో శనివారం నిర్వహించిన వైసీపీ ప్లీనరీకి మంత్రి బుగ్గనతోపాటు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, తోట కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ పాత ఎన్‌ఆర్‌ఐఈజీఎస్‌ పనులకు సంబంధించిన బిల్లులు జూన్‌ నెలాఖరులోపుల చెల్లిస్తామన్నారు. త్వరలో వైసీపీ కార్యకర్తలు సంతోషపడే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ తీసుకు రాబోతున్నారని అన్నారు. దొంగ లెక్కలు తేల్చేందుకే వ్యవసాయ మోటార్లకు కరెంటు మీటర్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఉచిత విద్యుత్‌ కోసం మరో 10వేల మెగా వాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మీట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీరాములు, ఈడిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చిన్న కేశవయ్యగౌడు, ఏపీఐసీసీ డైరెక్టర్‌ మర్రిగోవిందరాజ్‌, ఎంపీపీ రేగటి రాజశేఖర్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌, మార్కెట్‌ యార్డుచైర్మన్‌ రామచంద్రుడు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T05:23:15+05:30 IST