అమూల్‌ సేవలో సర్కార్‌

ABN , First Publish Date - 2022-05-20T06:04:02+05:30 IST

‘జగనన్న పాల వెల్లువ’ పథకం పేరుతో గుజరాత్‌కు చెందిన ప్రైవేటు సంస్థ ‘అమూల్‌’ (ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌) సేవలో వైసీపీ ప్రభుత్వం తరిస్తోంది.

అమూల్‌ సేవలో సర్కార్‌
అచ్యుతాపురంలో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్‌


ఫోటో రైటప్స్‌....


19ఏకేపీ.1. 

19ఏకేపీ.2. రైతు భరోసా కేంద్రంలో పాల సేకరణ ఏర్పాట్లు

19ఏకేపీ.3. డాక్టర్‌ బి.ప్రసాదరావు, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి 


ప్రైవేటు సంస్థపై వైసీపీ ప్రభుత్వం అవ్యాజ ప్రేమ

‘జగనన్న పాల వెల్లువ పథకం’ పేరుతో కలరింగ్‌

పాలసేకరణకు రైతు భరోసా కేంద్రాలు వినియోగం

అమూల్‌కు పాలుపోసేలా గ్రామాల్లో ఒత్తిళ్లు

పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితో చాకిరీ

నేడు జిల్లాలో పాల సేకరణ ప్రారంభం

తొమ్మిది మండలాల్లో 191 ఆర్‌బీకేల్లో ఏర్పాట్లు


(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

‘జగనన్న పాల వెల్లువ’ పథకం పేరుతో గుజరాత్‌కు చెందిన ప్రైవేటు సంస్థ ‘అమూల్‌’ (ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌) సేవలో వైసీపీ ప్రభుత్వం తరిస్తోంది.  పాల కేంద్రాల ఏర్పాటు నుంచి పాల సేకరణ వరకు అన్ని వ్యవహారాలను తన భుజానికెత్తుకుంది. ఇందుకోసం పంచాయతీరాజ్‌, రెవెన్యూ, వ్యవసాయ, సహకార, పశుసంవర్థక, తదితర శాఖల అధికారులు, సిబ్బందిని వినియోగిస్తున్నది. దశాబ్దాల నుంచి పాడి రైతులకు అండగా నిలుస్తున్న సహకార డెయిరీలని దెబ్బ తీసేందుకు సిద్ధ పడుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని కడప, చిత్తూరు, ప్రకాశం, తదితర జిల్లాల్లో ఇప్పటికే అమూల్‌కు పాల సేకరణ జరుగుతుండగా... అనకాపల్లి జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుంచి పాల సేకరణ ప్రారంభం కానున్నది.

అనకాపల్లి జిల్లాలో 24 మండలాలు ఉండగా తొలుత అనకాపల్లి, నక్కపల్లి, ఎలమంచిలి, అచ్యుతాపురం, కశింకోట, చోడవరం, కె.కోటపాడు, మునగపాక, పరవాడ మండలాల్లో అమూల్‌కు పాల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ మండలాల్లో 191 రైతు భరోసా కేంద్రాల్లో శుక్రవారం నుంచి పాల సేకరణ ప్రారంభం అవుతుంది. ఆయా కేంద్రాల పరిధిలో వున్న అన్ని గ్రామాల్లో డ్వాక్రా మహిళలతో ఇప్పటికే ‘పాల సహకార సంఘాల’ను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో రోజుకు కనీసం 160 లీటర్లు (ఉదయం 80, సాయంత్రం 80 లీటర్లు) సేకరించాలన్నది లక్ష్యం. గేదె పాలకు పది శాతం వెన్న వుంటే లీటరుకు రూ.72 చొప్పున అమూల్‌ చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు.  

అమూల్‌ సేవలో ప్రభుత్వ యంత్రాంగం

అమూల్‌కు పాల సేకరణ కోసం వైసీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నది. స్వతహాగా పాడి రైతుల కోసం పనిచేసే పశు సంవర్థక శాఖతోపాటు సహకార, వ్యవసాయ, డీఆర్‌డీఏ, డ్వామా, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా/ పరోక్షంగా అమూల్‌ పాల సేకరణలో భాగస్వాములు కానున్నారు. అయితే సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తకుండా ‘జగనన్న పాల వెల్లువ పథకం’ పేరుతో అమూల్‌కు పాల సేకరణ చేస్తున్నారు. అయితే పాడి  రైతులకు మేలు కోసం అంటూ ప్రైవేటు సంస్థకు పాల సేకరణకు ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. 


పది రోజుల్లో బ్యాంకు ఖాతాకు పాల డబ్బులు

డాక్టర్‌ బి.ప్రసాదరావు, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి 

జిల్లాలో తొలివిడత తొమ్మిది మండలాల్లోని 191 రైతు భరోసా కేంద్రాల్లో శుక్రవారం నుంచి పాల సేకరణ ప్రారంభం అవుతుంది. స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పాల సేకరణ ప్రారంభమవుతుంది. పాలు సరఫరా చేసిన రైతులకు పది రోజుల్లో బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. 3.5 కన్నా తక్కువ వెన్న శాతం వున్న ఆవు పాలను సేకరించరు. 

Updated Date - 2022-05-20T06:04:02+05:30 IST