సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీఠ: లక్ష్మారెడ్డి

ABN , First Publish Date - 2020-09-22T06:14:13+05:30 IST

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దపీఠ వేసిందని జ డ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని

సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీఠ: లక్ష్మారెడ్డి

జడ్చర్ల, సెప్టెంబరు 21: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దపీఠ వేసిందని జ డ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని నసరుల్లాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాన్ని మా డల్‌గా తీర్చిదిద్దుతానన్నారు. మిషన్‌ భగీరథలో భాగంగా నియోజకవర్గంలోనే ప్రథమంగా స్వచ్ఛమైన తాగునీరును గ్రామ ప్రజలకు అందించా మన్నారు. రూ.60 లక్షలతో నిర్మించిన లక్షా 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్‌ట్యాంక్‌ను, వెల్‌నెస్‌ సెంటర్‌ను, శ్మశానవాటిక, వర్మీకంపోస్ట్‌ తయారీ షెడ్‌లను ఎమ్మెల్యే ప్రారంభించారు. మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెల్‌నెస్‌ సెంటర్‌లో జడ్పీ వైస్‌చైర్మన్‌ కోడ్గల్‌ యాద య్యకు బీపీ చెక్‌ చేశారు. అనంతరం జడ్చర్ల పంచాయతీ కార్యాలయ ఆవరణలో 3 చెత్తను తీసుకెళ్లే వాహనాలను ప్రారంభించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేసీఆర్‌ ఆర్బిరేటమ్‌ను ప్రారంభించి, మొక్కలను నాటారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సదాశివయ్య పాల్గొన్నారు.


కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ: జడ్చర్ల మండలంలోని 129 మంది లబ్ధిదారులకు కోటీ 49 లక్షలా 64 వేల విలువ గల చెక్కులను ఎంపీడీఓ కార్యాలయం వద్ద అందించారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. బాదేపల్లి పట్టణంలోని పాతబజారు హనుమాన్‌ దేవాలయ ప్రహరీకి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మిశివకుమార్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, బాదేపల్లి సింగిల్‌విండో అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌, జడ్చర్ల, నసరుల్లాబాద్‌ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. 


రాజాపూర్‌లో..

రాజాపూర్‌: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సోమవారం మండలంలోని 13 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కును అందజేశారు. నలుగురికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, ఎంపీపీ సుశీల, జడ్పీటీసీ మోహన్‌, తహసీల్దార్‌ శంకర్‌, ఏఓ నరేందర్‌, రైతు సంఘం అధ్యక్షుడు నర్సింములు, గోపాల్‌రెడ్డి, ఏఎమ్‌సీ చైర్మన్‌ రఘువీర రెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, సర్పంచ్‌ బచ్చిరెడ్డి పాల్గొన్నారు.


జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హమీ ఇచ్చారు. బాధితులు ఎమ్మెల్యేను సోమవారం జడ్చర్లలో కలిశారు. 180 గజాల స్థలంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను మూడు నెలల్లో కట్టించి ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 


లక్ష్మణ్‌నాయక్‌ కుటుంబానికి అండ

మిడ్జిల్‌: ఈదులబావి తండా సర్పంచ్‌ లక్ష్మణ్‌నాయక్‌ మృతి చెందడం బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటానని లక్ష్మారెడ్డి చెప్పా రు. సోమవారం కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన వెంట పీఎసీఎస్‌ ఛైర్మన్‌ కూచురి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షు డు పాండు, గిరినాయక్‌ ఉన్నారు.

Updated Date - 2020-09-22T06:14:13+05:30 IST