నిర్వాసితులను మోసం చేస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-07-01T06:46:18+05:30 IST

మిడ్‌మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌ అన్నారు.

నిర్వాసితులను మోసం చేస్తున్న  ప్రభుత్వం
బాదితుడితో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌

వేములవాడ టౌన్‌, జూన్‌ 30: మిడ్‌మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌ అన్నారు.  వేములవాడ మండలం చీర్లవంచకు చెందిన మానువాడ రాజయ్య రేకుల షెడ్డు షార్ట్‌ సర్క్యుట్‌తో దగ్ధమవడంతో గురువారం బాధితులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగినప్పుడు మాత్రమే  అధికారులు హడావుడి చేస్తున్నారని, అనంతరం చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు.  మానువాడ రాజయ్యకు పాత చీర్లవంచలో ఇల్లు ఉందని ఇప్పటి వరకు ఇంటి పరిహారం అందలేదని అన్నారు. అధికారుల చుట్టూ  తిరిగితే 103 గెజిట్‌ చేశారని అందులో రాజయ్య ఇల్లు కూడా ఉందని అన్నారు. ప్రభుత్వం పరిహారం అందించడంలో ఆలస్యం చేయడంతోనే రేకులషెడ్డులో ఉంటున్నాడని, ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యుట్‌ కావడంతో షెడ్డు మొత్తం దగ్ధమైందని అన్నారు.  గతంలో మహాఽధర్నా చేసినప్పుడు మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌  డిసెంబర్‌లోగా నిర్వాసితులకు పరిహారం అందిస్తామని చెప్పారని  గుర్తు చేశారు. ఇప్పటికైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రను వదిలి నిర్వాసితులకు రావాల్సిన పరిహారం అందించాలని కోరారు.   కలెక్టర్‌ స్పందించి రాజయ్య కుటుంబానికి  తక్షణ సహాయం అందజేయాలన్నారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పిల్లి కనుకయ్య, ఎంపీటీసీ బాస రాజశేఖర్‌, ఎర్రం ఆగయ్య, వనపట్ల ప్రభాకర్‌రెడ్డి, కత్తి కనుకయ్య, బోనాల రమేష్‌, మల్లేశం, చంద్రయ్య, మల్లేశం, గణేష్‌, చింజీవి ఉన్నారు. 

Updated Date - 2022-07-01T06:46:18+05:30 IST