AP NEWS: పర్యాటకానికి ఏపీని కేంద్రంగా చేసేందుకు ప్రభుత్వం కృషి: వర ప్రసాద్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-09-24T01:56:22+05:30 IST

పర్యాటకానికి ఏపీని కేంద్రంగా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్ధ చైర్మన్ వర ప్రసాద్‌రెడ్డి అన్నారు.

AP NEWS: పర్యాటకానికి ఏపీని కేంద్రంగా చేసేందుకు ప్రభుత్వం  కృషి:  వర ప్రసాద్‌రెడ్డి

విజయవాడ: పర్యాటకానికి(tourism) ఏపీని కేంద్రంగా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్ధ చైర్మన్ వర ప్రసాద్‌రెడ్డి( Vara Prasad Reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంటర్ నేషనల్ ఎక్స్‌పో జరిగిందన్నారు.లండన్ ఎక్సల్ అనే ప్రాంతంలో జరిగిన ఎక్స్‌పోలో ప్రపంచ వ్యాప్తంగా ఐదు వందల కంపెనీలు పాల్గొన్నాయని చెప్పారు.ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN REDDY) ఆదేశాలతో ఎక్స్‌పోలో పాల్గొన్నట్లు తెలిపారు. అన్నీ కంపెనీలతో సంప్రదించి రాష్ట్రంలో ఉన్న వనరులను,టూరిజం పాలసీ గురించి వివరించామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ,జాయింట్ వెంచర్లలో పెట్టుబడి పెట్టేందుకు జాతీయ స్థాయి కంపెనీలతో మాట్లాడినట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో ఉన్న టెక్నాలజీని రాష్ట్రానికి తెచ్చేలా సంప్రదింపులు జరిపినట్లు వివరించారు.


లండన్‌లో జరిగిన సెమినార్‌లో రాష్ట్ర టూరిజం‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు.టర్కికి చెందిన పోలిన గ్రూప్ లాంటి 11 పెద్ద కంపెనీలు రాష్ట్రానికి రావడానికి విముఖత వ్యక్తం చేశాయన్నారు.ప్రైవేటు పెట్టుబడి దారులను సంప్రదించి రాష్ట్రంలో వాటర్ ఫాల్స్‌ను ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపాయి.టెక్నాలజీతో పెట్టుబడులు తెచ్చేనెదుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.లండన్ ఐ అనే కంపెనీని వైజాగ్‌లో ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.పీపీపీ పద్ధతిలో పెట్టుబడులు రాబట్టి రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.అందరం కలిసి దేశంలోనే లేని పర్యాటక ప్రాంతాలను ఏపీలో ఏర్పాటు చేస్తామని వర ప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-09-24T01:56:22+05:30 IST