ఇప్పటిదాకా లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం: కేటీఆర్

ABN , First Publish Date - 2021-04-08T23:58:53+05:30 IST

జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి మంత్రి కేటీఆర్ నియామక పత్రాలు అందజేశారు.

ఇప్పటిదాకా లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం: కేటీఆర్

హైదరాబాద్: జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి మంత్రి కేటీఆర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పటిదాకా లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ప్రైవేట్ రంగంలో 15 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను సృష్టించామని, ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రజల సేవల కోసం ఉపయోగించాలని కేటీఆర్ సూచించారు.


Updated Date - 2021-04-08T23:58:53+05:30 IST