ఏపీలో మద్య నిషేధం ఉండదని మరోసారి తేల్చేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-06-18T01:01:19+05:30 IST

ఏపీలో మద్య నిషేధం ఉండదని మరోసారి ప్రభుత్వం తేల్చేసింది. కొత్త బార్ల పాలసీని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీలో మద్య నిషేధం ఉండదని మరోసారి తేల్చేసిన ప్రభుత్వం

అమరావతి: ఏపీలో మద్య నిషేధం ఉండదని మరోసారి ప్రభుత్వం తేల్చేసింది. కొత్త బార్ల పాలసీని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పాలసీలో మూడేళ్లపాటు బార్ల లైసెన్స్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో 460ను ప్రభుత్వం విడుదల చేసింది. జూన్‌ 30తో ప్రస్తుతం ఉన్న బార్‌ల లైసెన్స్‌ గడువు ముగిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న బార్‌ల లైసెన్స్‌లు మరో 2 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి కొత్త పాలసీ అమలోకి వస్తుంది. 840 బార్‌లకు మించకుండా లైసెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50 వేలలోపు జనాభా గల ప్రాంతంలో రూ.5 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో రూ.7.50 లక్షలు, 5 లక్షలకుపైగా జనాభా ప్రాంతాల్లో రూ.10 లక్షలు అప్లికేషన్‌ ఫీజు కేటాయించింది. ఏపీలో వేలం పద్ధతిలో షాపుల కేటాయిస్తారు. త్రీస్టార్ హోటల్‌లో లైసెన్స్‌ ఫీజు రూ.5 లక్షలు, ఏడాదికి నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ట్రేషన్‌ చార్జీ రూ.50 లక్షలుగా నిర్ణయించారు. 

Updated Date - 2022-06-18T01:01:19+05:30 IST