రిమ్స్‌ నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2021-04-21T05:30:00+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌తో వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నా పట్టించుకునే వారు లేరని ఆదిలాబాద్‌ రిమ్స్‌పై పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ ఆరోపించారు.

రిమ్స్‌ నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్యం

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌ 21: జిల్లాలో కరోనా వైరస్‌తో వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నా పట్టించుకునే వారు లేరని ఆదిలాబాద్‌ రిమ్స్‌పై పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ ఆరోపించారు. కొన్ని రోజులుగా రిమ్స్‌లో నెలకొన్న సమస్యలు, అపరిశుభ్రతపై పట్టించుకోక పోవడంతో బుధ వారం ఆయన రిమ్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పీపీఈ కిట్టు ధరించి కొవిడ్‌ వార్డును పరిశీలించారు. వార్డులో పరిసరాల పరిశుభ్రత కొరవడిందని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరిన పట్టించుకునే వారే లేరని ఆరోపించారు. రోగులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్లు, మందులు సరిపోవడం లేదనే సాకుతో రోగులకు ఇవ్వాల్సిన విలువైన మందులు అమ్ముకుంటున్న పరిస్థితి రిమ్స్‌లో నెలకొందని ఆరోపించారు. డాక్టర్‌ల కొరత పరిస్థితి కూడా మరింత గోరంగా ఉందని పాలకులు, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వీరితో పాటు పలువురు బీజేపీ నాయకులు తదితరులున్నారు.  

Updated Date - 2021-04-21T05:30:00+05:30 IST