‘విద్యా బోధనకు అడ్డుపడుతున్న ప్రభుత్వం’

ABN , First Publish Date - 2021-03-08T05:41:15+05:30 IST

ప్రభుత్వ యంత్రాంగం ఉపాధ్యా యులకు బోధనేతర పనులు అప్పగించి విద్యార్థుల బోధనకు అడుగడుగునా అడ్డు పడుతోందని ఏపీటీఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు బంకురు జోగినాయుడు ఆరోపించా రు.

‘విద్యా బోధనకు అడ్డుపడుతున్న ప్రభుత్వం’

శృంగవరపుకోట, మార్చి 7: ప్రభుత్వ యంత్రాంగం ఉపాధ్యా యులకు బోధనేతర పనులు అప్పగించి విద్యార్థుల బోధనకు అడుగడుగునా అడ్డు పడుతోందని ఏపీటీఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు బంకురు జోగినాయుడు ఆరోపించా రు. ఆదివారం ఎస్‌.కోట ఎన్‌జీవో హోంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రభుత్వాలు గడిచిన పదేళ్లలో ఉపాధ్యాయులకు బోధనే తర పనులు అప్పగించి విద్యార్థులకు సక్రమ బోధన లేకుండా చేస్తున్నాయన్నారు. ఉపాధ్యాయులకు సంక్షేమ కార్యక్రమాలు అప్పగించడంతో పాఠశాలల్లో బోధన కుంటుపడుతుందన్న విషయం ఈ ప్రభుత్వాలకు పట్టకపోవడం దారుణమ న్నారు. అమ్మఒడి పఽథకా న్ని ప్రభుత్వ విద్యాసంస్థలకే అప్పగించాలని, నాడునేడు పనులను అవగాహన లేని ఉపాధ్యాయులకు అప్పగించడం సరికాదన్నారు. ఇలాంటి పనులతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు కుంటుపడితే వీటిది ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సంఘ రాష్ట్ర కౌన్సిలర్‌ కర్రి రవి, జిల్లా బాధ్యులు వై.గురుమూర్తి, కె.వెంకటరావు, రమేష్‌ ఉన్నారు.

Updated Date - 2021-03-08T05:41:15+05:30 IST