ఒమైక్రాన్‌ వేరియంట్‌తో అప్రమత్తమైన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-01-02T21:48:29+05:30 IST

ఒమైక్రాన్‌ వేరియంట్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రవీంద్రభారతి ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఒమైక్రాన్‌ వేరియంట్‌తో అప్రమత్తమైన ప్రభుత్వం

హైదరాబాద్‌: ఒమైక్రాన్‌ వేరియంట్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రవీంద్రభారతి ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా జాగ్రత్త చర్యల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించకూడదని అధికారులు ఆదేశించారు. ఒమైక్రాన్‌, కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 10 వరకు ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సమావేశాలతో పాటు ప్రజలు గుమిగూడే మతపరమైన, రాజకీయ, సాంస్కృతిక సంబంధిత కార్యక్రమాలను నిషేధించింది. రాష్ట్రంలో శనివారం మరో 12 ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముప్పు జాబితాలో లేని దేశాల నుంచి వచ్చినవారు 9 మంది ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య 79కి పెరిగింది. విదేశాల నుంచి 123 మంది రాష్ట్రానికి చేరుకోగా, పదిమందికి కరోనా నిర్ధారణ అయింది. మరోవైపు శనివారం 28,886 మందికి పరీక్షలు చేయగా 317 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. వరుసగా ఏడో రోజూ కేసుల పెరుగుదల నమోదైంది.

Updated Date - 2022-01-02T21:48:29+05:30 IST