
హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లిం సోదరులకు రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రంజాన్ ఉపవాసాల నేపద్యంలో ఉద్యోగులు ప్రతి రోజూ గంట ముందే అంటే సాయంత్రం 4గంటలకే కార్యాలయాల నుంచి వెళ్లడానికి అనుమతిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. ఉపవాసాల అనంతరం సాయంత్రం మసీదుల్లో ప్రార్ధనలు చేస్తారు. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి వారు తాము పనిచేసే కార్యాలయాల నుంచి గంట ముందే వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి జారీ చేసింది.
ఇవి కూడా చదవండి