ఫ్యాప్టో ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించాలి

ABN , First Publish Date - 2022-07-06T06:43:34+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 117 జీవోలో ఫ్యాప్టో ప్రతిపాదనలను పరిశీలించాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్‌ చేశారు.

ఫ్యాప్టో ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించాలి
వై.పాలెం ఫ్యాప్టో నూతన కార్యవర్గం

గిద్దలూరు, జూలై 5 : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 117 జీవోలో ఫ్యాప్టో ప్రతిపాదనలను పరిశీలించాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక యూటీఎఫ్‌ కార్యాలయంలో మంగళవారం ఫ్యాప్టో చైర్మన్‌ వై.శ్రీనివాసులు మాట్లాడుతూ 117 జీవోకు వ్యతిరేకంగా ఈ నెల 8న ఒంగోలులోని డీఈవో కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నందున గిద్దలూరు తాలూకాలోని ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని కోరారు. ఈ జీవోకు సంబంధించి ఫ్యాప్టో చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కో-చైర్మన్లు  సుబ్బారాయుడు, కబీర్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా అదనపు కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, ఇతర యూనియన్ల నాయకులు పిచ్చయ్య,  పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

 ఎర్రగొండపాలెం :   తాలూకా ఫ్యాప్టో చైర్మన్‌గా ఆర్‌.మాలకొండానాయక్‌, ప్రధాన కార్యదర్శిగా  ఎ నాగయ్య, ఉపాధ్యక్షుడిగా  బీవీ.నరసింహరావు, ఏ.శ్రీనివాసరావు,  డీఏ.నాయక్‌  ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. కార్యదర్శులుగా డీఏ. ప్రభాకర్‌,  ఎం.శ్రీనివాసులు, ఎం.శ్యాంరాజు, ఎం.భాస్కర్‌, కే.రాజశేఖర్‌, ఎం.గల్షన్‌బేగ్‌, డి.తిరుపతినాయక్‌, పి.కృష్ణారావు, ఆర్‌ సుబ్రహ్మణ్యం, ఎం.దీప్లానాయక్‌, ఎన్‌.నాగూర్‌షరీఫ్‌ ఎన్నిక అయ్యారు. మంగళవారం సాయంత్రం  ప్యాఫ్టో అసోసియేషన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం జీవో 117 రద్దు చేయాలని కోరుతూ ఎర్రగొండపాలెంలోని రాష్ట్రపురపాలక పట్టణాభివృద్దిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

Updated Date - 2022-07-06T06:43:34+05:30 IST