టమోటా రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-08-07T04:58:18+05:30 IST

గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతున్న టమోటా రైతుల ను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డి మాండ్‌ చేశారు.

టమోటా రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
టమోటా యార్డులో ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 6: గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతున్న టమోటా రైతుల ను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డి మాండ్‌ చేశారు. శనివారం నీరుగట్టువా రిపల్లె, మార్కెట్‌ యార్డు ఎదురుగా రైతులను ఆదుకోవాలని, ప్రభుత్వమే ట మోటాలను కోనుగోలు చేయాలని, జాక్‌ పాట్‌ విదానం రద్దు చేయాలని కోరుతూ పెద్దఎత్తున్న ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌ గా కార ణంగా ధరలు పడిపోవడంమేగాక, జాక్‌పాట్‌ విధానంలో  దోపిడీకి గురవుతు న్నార న్నారు. ప్రభుత్వం టమోటా ప్రాససింగ్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో రైతు సంఘం మండల అఽధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌, నాయకులు ఈశ్వరనాయుడు, మల్లికార్జున, నరసంహులు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు హరీంధరనాద్‌, ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-07T04:58:18+05:30 IST