స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం చేయూత

ABN , First Publish Date - 2022-09-28T06:17:11+05:30 IST

స్వయం ఉపాధి కల్ప నకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో చేయూతనందిస్తోందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు.

స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం చేయూత
మిషనరీని పరిశీలిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్వయం ఉపాధి కల్ప నకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో చేయూతనందిస్తోందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో  ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా రెండు రోజులపాటు నిర్వహించే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మిషనరీ ప్రదర్శనను ప్రారం భించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ అరుణ మాట్లాడుతూ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మిషనరీలను ప్రతి ఒక్కరూ పరిశీలించాలని, యూని ట్లను స్థాపించి ఉపాధి పొందాలని అన్నారు. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ ఈ పథకాన్ని వ్యక్తులతోపాటు ఎస్‌జీ౅ హచ్‌లు, పాక్స్‌ వంటి సంస్థలు సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. యూనిట్‌ల స్థాపనకు ప్రభుత్వం 35 శాతం రాయితీ అందిస్తుందన్నారు. మార్కెటింగ్‌ సౌకర్యం కూడా కల్పిస్తుంద దని ఈ సందర్భంగా తెలిపారు. అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్‌  ఉపేందర్‌ రావు, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-28T06:17:11+05:30 IST