ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-25T07:07:56+05:30 IST

ప్రభుత్వం రైతులకు వివిధ పథకాల ద్వారా అందజేస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు.

ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలి
ధ్రువపత్రం అందజేస్తున్న నాగార్జునరెడ్డి

ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి

మార్కాపురం, సెప్టెంబరు 24: ప్రభుత్వం రైతులకు వివిధ పథకాల ద్వారా అందజేస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో నియో జకవర్గంలోని రైతులకు రాయితీపై మంజూరైన డ్రిప్పులు, స్పింకర్లను అందజేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని 49 మంది రైతులకు రాయితీపై సూక్ష్మ, బిందు సేద్యానికి సంబంధించిన పరికరాలు రాయితీపై మంజూర య్యాయన్నారు. మొత్తం రూ.58 లక్షల విలువైన సామగ్రికి రూ.50 లక్షలు ప్రభుత్వం రాయితీ ఇచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతుల ఆర్థిక ఉన్నతికి అమలుజేస్తున్న పథకాల ద్వారా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను పాటిస్తు న్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రవీంద్రబాబు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్‌.శ్రీనివాసరావు, మార్కాపురం, తర్లుపాడు ఎంపీపీలు పోరెడ్డి అరుణ, భూలక్ష్మి, ఉద్యానవన అధికారి రమేష్‌, నియోజకవర్గం లోని ఏవోలు డి.శ్రీనివాసరెడ్డి, ప్రసన్నలక్ష్మి, చంద్రశేఖర్‌, జైలాలుద్దీన్‌, ఉద్యానవన శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. 

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

మార్కాపురం(వన్‌టౌన్‌) : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మె ల్యే కేపీ.నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక డ్వాక్రా బజార్‌లో మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత వారోత్సవాలు శనివారం నిర్వహించారు. కార్య క్రమంలో చైర్మన్‌ బాలమురళీకృష్ణ, వైస్‌చైర్మన్లు షేక్‌.ఇస్మాయిల్‌, సీహెచ్‌.అంజమ్మ, ఎంపీపీ పి.అరుణ, మున్సిపల్‌ కమీషనర్‌ గిరికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T07:07:56+05:30 IST