ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-05-11T04:22:43+05:30 IST

నపై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం కొవిడ్‌తో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఉంటే, ఆయన కోసం ఒక ఫ్లోర్‌ అంతా కేటాయించి కలెక్టర్‌ సహకరించారన్నారు. స్పీకర్‌ ఆరోగ్యం బాగానే ఉన్నా, ఎందుకు పదిరోజులు ఆసుపత్రిలో ఉంచారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ కుటుంబానికి వసతులు కల్పించి, పేదలకు బెడ్లు లేకుండా చేస్తున్నారని ఆ

ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వం




 శ్రీకాకుళం టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవి కుమార్‌

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం గాలికొది లేసిందని శ్రీకాకుళం టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవి కుమార్‌ ఆరోపించారు. కరోనా వేళ ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. సోమవా రం ఆయన మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు. రాష్ట్రంలో అసలు కరోనా లేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని.. కొవిడ్‌ మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నా రని విమర్శించారు. జిల్లాలో మర ణాలు ఎక్కువగా ఉన్నా... కేవలం 420 మంది మాత్రమే చనిపోయారని అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు పేదవాడి చావంటే లెక్కలేదన్నారు. తప్పుడు నివేదికలను సర్వోన్నత న్యాయస్థానానికి పంపడం దురదృష్టకరమన్నారు. ఇంతటి విపత్తును మంత్రులు కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి పుట్టినరోజున వందలాది మందితో కలిసి మాస్క్‌లు లేకుండా చిందులు వేశారని ఎద్దేవా చేశారు. ఇటువంటి విషయాలను ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతగల మంత్రి పార్టీల్లో చిందులు వేస్తే ఆయనపై కనీస చర్యలు లేవన్నారు. మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ దాదాపు రెండు నెలలుగా ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తే ఆయనపై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం కొవిడ్‌తో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఉంటే, ఆయన కోసం ఒక ఫ్లోర్‌ అంతా కేటాయించి కలెక్టర్‌ సహకరించారన్నారు. స్పీకర్‌ ఆరోగ్యం బాగానే ఉన్నా, ఎందుకు పదిరోజులు ఆసుపత్రిలో ఉంచారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ కుటుంబానికి వసతులు కల్పించి, పేదలకు బెడ్లు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ పాలనతో రాష్ట్రాన్ని కరోనా మయం చేశారని ఆరోపించారు. ప్రజలకు ఉచిత పథకాలు కాదు, ఉచిత వ్యాక్సిన్‌ కావాలని గుర్తించాలన్నారు. ప్రజలు కట్టిన పన్ను డబ్బుతోనే వ్యాక్సిన్‌ కొనుగోలు చేయాలని టీడీపీ కోరుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 19వేల యాక్టివ్‌ కేసులు ఉంటే... కేవలం 1000 రెమిడెసీవర్‌ ఇంజెక్షన్‌లు మాత్రమే ఉన్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.



Updated Date - 2021-05-11T04:22:43+05:30 IST