జూన్ తర్వాత వర్క్ ఫ్రం హోంకు ముగింపు!

ABN , First Publish Date - 2021-06-17T01:40:16+05:30 IST

కరోనా కారణంగా బడా బడా కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాయి. కొన్ని దేశాలు దీనికోసం ప్రత్యేకంగా నిబంధనలు తెచ్చాయి.

జూన్ తర్వాత వర్క్ ఫ్రం హోంకు ముగింపు!

బెర్లిన్: కరోనా కారణంగా బడా బడా కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాయి. కొన్ని దేశాలు దీనికోసం ప్రత్యేకంగా నిబంధనలు తెచ్చాయి. అయితే ఈ నిబంధనలను జూన్ తర్వాత తొలగించేయాలని జర్మనీ భావిస్తోందట. కంపెనీలన్నీ ఉద్యోగులకు కచ్చితంగా వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించాలనే రూల్‌ను జూన్ తర్వాత తొలగించే యోచనలో జర్మనీ ప్రభుత్వం ఉందని సమాచారం. ఈ మేరకు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెల్జ్ బ్రాన్ వెల్లడించారు. జనవరి నెలలో తీసుకొచ్చిన ఈ నిబంధనను జూన్ 30 తర్వాత పొడిగించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. కొత్త వేరియంట్ల వ్యాప్తిని బట్టి ఈ రూల్ మళ్లీ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది అని బ్రాన్ పేర్కొన్నారు.

Updated Date - 2021-06-17T01:40:16+05:30 IST