Hindusthan Zink లో... మొత్తం వాటా విక్రయం..!

ABN , First Publish Date - 2022-05-25T20:56:30+05:30 IST

హిందుస్థాన్ జింక్‌లో తన మొత్తం వాటాను కేంద్రప్రభుత్వం విక్రయించనుందా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది.

Hindusthan Zink లో...  మొత్తం వాటా విక్రయం..!

న్యూఢిల్లీ : హిందుస్థాన్ జింక్‌లో తన మొత్తం వాటాను కేంద్రప్రభుత్వం విక్రయించనుందా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. వాటా అమ్మకానికి సంబంధించి... ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(CCEA)  బుధవారం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీలో తనకున్న 29.5 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 36 వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.


నిరుడు నవంబరులో... హిందూస్తాన్ జింక్‌లో ఉపసంహరణను సుప్రీంకోర్టు క్లియర్ చేసిన విషయం తెలిసిందే. కంపెనీలో మొత్తం 29.5 శాతం రెసిడ్యూరీ వాటాను ఆఫ్‌లోడ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ రోజు(మే 25, బుధవారం) నాటికి హిందుస్థాన్ జింక్ వాటా విలువ రూ. 39,385.66 కోట్లు. కాగా... తాజా వార్తల    నేపథ్యంలో హిందుస్థాన్ జింక్ స్టాక్ 6.81 శాతం పెరిగి రూ. 315.90 కు చేరుకోవడం గమనార్హం. కంపెనీలో సాధారణ వాటాదారుగా ఉన్న ప్రభుత్వానికి... 29.5 శాతం అవశేష వాటా ఉన్నందున మెటల్ ఉత్పత్తిదారు ప్రభుత్వ కంపెనీగా ఉంది. ఈ క్రమంలో... వాటాల ఉపసంహరణపై నిర్ణయం తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.


హిందుస్థాన్ జింక్ భారతదేశంలో జింక్, సీసంలకు సంబంధించి అతిపెద్ద సమీకృత ఉత్పత్తిదారులలో ఒకటి. ఇది దేశంలో జింక్-లీడ్ సహా వెండి యొక్క ఏకీకృత ఉత్పత్తిదారుగా కూడా ఉంది. హిందుస్థాన్ జింక్ 1996లో స్థాపితమైంది. ఇందులో మెజారిటీ వాటా ప్రభుత్వానిదే. కాగా... నిరుడు(2002 లో)... ప్రభుత్వం వేదాంతకు వ్యూహాత్మక విక్రయం ద్వారా కంపెనీలోని 26 శాతం ఈక్విటీని విక్రయించింది. ప్రారంభ వాటా కొనుగోలు తర్వాత, అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని బహుళజాతి మైనింగ్-టు-మెటల్స్ సమ్మేళనం తప్పనిసరి ఓపెన్ ఆఫర్ ద్వారా బహిరంగ మార్కెట్ నుండి సంస్థలో 20 శాతం కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆగస్టు  2003 లో వేదాంత గ్రూప్ హిందుస్థాన్ జింక్‌లో 18.92 శాతం వాటాను కొనుగోలు చేసింది. లీడ్ మెటల్ ప్రొడ్యూసర్‌లో వేదాంత ఇప్పుడు 64.92 శాతం వాటాను కలిగి ఉంది. కాగా... కేంద్ర వాటా విక్రయం జరిగినపక్షంలో... హిందుస్థాన్ జింక్ స్టాక్ భవిష్యత్తులో ఒత్తిడిని ఎదుర్కొంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2022-05-25T20:56:30+05:30 IST