Advertisement

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

May 4 2021 @ 22:42PM
ముస్లిం మహిళలకు రంజాన్‌ పండగ కానుకలను అందజేస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు 

లక్షెట్టిపేట, మే 4: ప్రజా అవసరాలను తీర్చ డంతోపాటు మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం నిరం తరం కృషి చేస్తోందని, ప్రతీ పల్లెకు మౌలిక సదు పాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు అన్నారు. మంగళవారం విశ్రాంతి భవనంలో ముస్లిం సోదరులకు ప్రభుత్వం అందిస్తున్న రంజాన్‌ తోఫాను పంపిణీ చేశారు. కుల, మత, రాజకీ యాలకు అతీతంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణ సర్కారు మాత్ర మే అమలు చేస్తోందన్నారు.  కార్యక్రమంలో మున్సి పల్‌ చైర్మన్‌ కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ పొడేటి శ్రీని వాస్‌గౌడ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగన్న, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌ రెడ్డి, తహసీల్దార్‌ వేముల రాజ్‌కు మార్‌, ఎంపీడీఓ సత్యనారాయణ, పీఆర్‌డీఈ హరీష్‌ ఏఈ శృతి, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

ఏసీసీ: రంజాన్‌ పండుగను పురస్కరిం చుకొని రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లింలకు అందిస్తు న్న కానుకలను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మంగళవారం అందజేశారు. జిల్లా కేంద్రంలోని మె ౖనార్టీ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, ధనిక తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దుస్తులు, నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో  మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భూమేష్‌, కౌన్సిలర్‌ మిన్హాజ్‌ పాల్గొన్నారు. 

 


Follow Us on:
Advertisement