‘ఏస్సీ వర్గీకరణలో ప్రభుత్వాలు విఫలం’

ABN , First Publish Date - 2021-01-17T06:33:47+05:30 IST

ఎస్సీల వర్గీకరణ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షు డు మందక్రిష్ణ మాదిగ అన్నారు.

‘ఏస్సీ వర్గీకరణలో ప్రభుత్వాలు విఫలం’

ఇచ్చోడ, జనవరి 16: ఎస్సీల వర్గీకరణ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షు డు మందక్రిష్ణ మాదిగ అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఏ ర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి అనుబంధ సంఘాల సదస్సుకు ముఖ్యఅతిఽథిగా హాజరై వారు మాట్లడారు. మహాజన సోషలిస్టు పార్టీ అన్నివర్గాల ప్రజలను చైతన్య వంతం చేయడమే లక్ష్యంగా ప్రతీఒక్కరు గ్రామస్థాయి నుంచి స్వచ్ఛంధంగా ముందుకు రావాలన్నారు. స్వాత్రంత్య్రం వచ్చి 74ఏళ్లు అవుతున్నా మా బతుకులు మారలేదు, ఇపుడైన సమైక్యతంగా ఉండి సాధించుకుందాం అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజు ల్లో వర్గీకరణ చేస్తామన్నారని, ఇప్పటికీ ఆరేళ్లు గడిచినా వారికి చిత్త శుద్ధి లేదన్నారు. క్రమంగా మాదిగ జాతిని అణచి వేస్తూ వస్తున్న టీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వన్ని ఎమ్మార్పీఎస్‌ నీడలా వెంటాడుతుందని హెచ్చ రించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో దొరల గడిల పాలనకు చరమ గీతం పాడుతామని, మాదిగ జాతిని రాబోయే రోజుల్లో ఆధికారమే లక్ష్యంగా ప్రయాణం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీ య నాయకులు రేగుంట కేశవరావ్‌ మాదిగ, బాలేరావ్‌ నంద కూమార్‌ మాదిగ, తుకారం మాదిగ, రాష్ట్ర నాయకులు గజ్జెల శంకర్‌ మాదిగ, కాంబ్లే బాలజీ, కే.స్వామీ మాదిగ, జిల్లా నాయకులు సిరిసిల్ల భూమయ్య మాదిగ, దిబాక సుభాష్‌ మాదిగ, కారెం రవి మాదిగ, ఆరెల్లి మహేష్‌ పాలేపు గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T06:33:47+05:30 IST