ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం

ABN , First Publish Date - 2022-05-28T04:44:24+05:30 IST

ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీ ఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బాల్‌రామ్‌, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జయ పేర్కొ న్నారు.

ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం
పేట తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నాలో పాల్గొన్న వామపక్ష పార్టీల నాయకులు

నారాయణపేట, మే 27 : ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీ ఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బాల్‌రామ్‌, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జయ పేర్కొ న్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ముందు వామపక్ష పార్టీల ఆధ్వర్యం లో జరిగిన ధర్నాలో వారు పాల్గొని మాట్లాడారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, వంట నూనె తదితర ని త్యావసర ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలన్నా రు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ధరలు పెంచుతూ సామాన్యులపై మోయ లేని భారం వేస్తోందని విమర్శించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేసి 14 రకాల నిత్యావసర వస్తువులు అందించాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిని తహసీల్దార్‌కు అందించారు. కార్యక్రమంలో వామ పక్ష నాయకులు ప్రశాంత్‌, నరసింహా, నారాయణ, హజిమలాంగ్‌, కాశప్ప, దస్తప్ప, ప్రతాప్‌, బాలకృష్ణ, నరహరి, కృష్ణ, సలీం, గోవిందు, శంకర్‌, బాల్‌రామ్‌, ఆంజనేయులు పాల్గొన్నారు. 

మక్తల్‌ : నిత్యావసర సరుకులతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని వామపక్ష నాయకులు కొండన్న, కోవిందరాజులు, కిరణ్‌ పేర్కొ న్నారు. శుక్రవారం మక్తల్‌ తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ సామాన్యుడిపై మోయలేని భా రం పెంచి సామాన్యుల నడ్డీ విరుస్తున్నారన్నారు. 2014లో రూ.70 ఉన్న లీటరు పెట్రోల్‌, డీజిల్‌ నేడు రూ.110కి చేరిందన్నారు. రూ.450 ఉన్న వంట గ్యాస్‌ సిలిండర్‌ రూ.వెయ్యి దాటిందన్నారు. వంట నూనెల ధరలు రూ.80 నుంచి రూ.200 చేరడంతో సామాన్య ప్రజలు కొనలేని స్థితిలో ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ర్టేషన్ల ధరలు పెం చి సామాన్య ప్రజలు రిజిస్ర్టేషన్‌ చేసుకునే పరిస్థితి ల్లో లేరన్నారు. వామపక్ష పార్టీల నాయకులు భగవంతు, ఏజీ బుట్టో, భాస్కర్‌, గోపా ల్‌, కళ్యాణం రాజు, హబీబ్‌, దేవప్ప, నర్సిములు పాల్గొన్నారు. 

మాగనూరు : రాష్ట్ర వ్యాప్త నిరసన  కార్యక్ర మంలో భాగంగా సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.  సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆంజనేయులు మా ట్లాడుతూ బీజేపీ పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, ని త్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయ న్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి జి.నరేష్‌, నర్సింహులు, బి.రాఘవేంద్ర, జి.గోవిందు, బస్వరాజ్‌, పకీరప్ప, సాకేత్‌, నయూం, శివ పాల్గొన్నారు.

దామరగిద్ద : పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధర లను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవా రం సీపీఎం మండల నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సీపీ ఎం మండల నాయకుడు అంజిలయ్యగౌడ్‌ మాట్లాడుతూ మోదీ పెట్రోల్‌, డీజిల్‌తో పాటు నిత్యావసర ధరలు పెంచడంతో కేంద్రం దారిలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా బస్సు, విద్యుత్‌ చార్జీలు పోటీపడి పెం చుతున్నారన్నారు. అనంతరం తహసీల్దార్‌ వెంకటేష్‌కు వినతిపత్రం అందించారు. నాయకులు రాజు, నర్సిములు, మల్లేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఊట్కూర్‌ : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌  వంట గ్యాస్‌ ధరలను తగ్గించాలని వామపక్ష పార్టీల పిలుపు మేరకు శుక్రవారం మండల కేంద్రంలో సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా ఆఽధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్‌ నాయకుడు చెన్నప్ప మాట్లాడుతూ ధరల పెరుగుదలతో ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే పెట్రోల్‌, డీజిల్‌తో పాటు నిత్యావసర ధరలు తగ్గించాలన్నారు. అనంతరం ఏఐకేఎంఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి కనకరాయుడు, మండల కోశాధికారి నర్సింహా, పీవైఎల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సిద్దు మాట్లాడారు. కార్య క్రమంలో రాములు, బి.అంజి, నిడుగుర్తి బాబు, కాళేశ్వర్‌, చంద్రప్ప, అంజప్ప పాల్గొన్నారు. 





Updated Date - 2022-05-28T04:44:24+05:30 IST