మహిళల రక్షణలో ప్రభుత్వాలు విఫలం

ABN , First Publish Date - 2021-09-18T05:59:30+05:30 IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణలో విఫలమయ్యాయని ఉ ట్నూర్‌ జడ్పీటీసీ సభ్యురాలు చారులత రాథోడ్‌ ఆరో పించారు.

మహిళల రక్షణలో ప్రభుత్వాలు విఫలం
జడ్పీటీసీ దీక్షకు సంఘీభావం తెలుపుతున్న మహిళా ఉద్యోగులు

రిలే దీక్షలో జడ్పీటీసీ చారులత 

ఉట్నూర్‌, సెప్టెంబరు 17 : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణలో విఫలమయ్యాయని ఉ ట్నూర్‌ జడ్పీటీసీ సభ్యురాలు చారులత రాథోడ్‌ ఆరో పించారు.  అంబేద్కర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జడ్పీటీసీ చారులత రాథోడ్‌ రిలే దీక్ష నిర్వహించగా ప్రజాసంఘాలు, మహిళ ఉద్యోగ సం ఘాలు సంఘీభావం తెలిపాయి.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో మహిళలకు రక్షణ కొరవడిందని అన్నారు. సైదాబాద్‌ సింగరేణి కాలనీ  రాజదాని నగరంలో ఉన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఈ సంఘటన సిగ్గుచేటు అన్నారు. బంగారు తెలంగాణలో మహిళలకు  రక్షణ ఉంటుందన్నారు. బాధి త  కుటుంబానికి రూ.పదికోట్ల నష్టపరిహారంతో పాటు ఒకరి ఉద్యోగం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భరత్‌చౌహాన్‌, జిల్లా నాయకులు వెడ్మ బోజ్జులు, ఆదివాసీ మహిళ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆత్రం సుగుణ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మహిళ ఉద్యోగులు రాథోడ్‌ లలిత, బానోత్‌ రేణుక,  లింగంపల్లి చంద్ర య్య, యాకుబ్‌బేగ్‌, నందం, సర్పంచ్‌ సునిల్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ నాయకులు ఎక్బాల్‌, అన్నపూర్ణ, రాధాబాయి, కలీంపాషా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-18T05:59:30+05:30 IST