పెట్రో ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు

Jun 15 2021 @ 00:50AM
చిన్నశంకరంపేటలో ఎడ్లబండ్ల ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులు

 చిన్నశంకరంపేట, జూన్‌ 14: డీజిల్‌ పెట్రోల్‌ ధరలు పెంచి బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి విమర్శించారు. ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో డీజిల్‌ పెట్రోల్‌ ధరలకు నిరసనగా  చిన్నశంకరంపేటలోని శ్రీనివాసగార్డెన్‌ నుంచి బస్టాండ్‌ వరకు ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీఎం మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎడ్ల బండ్ల ఊరేగింపు సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేసి పూచీకత్తుపై విడుదతల చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. 

Follow Us on: