ప్రభుత్వాలు సహకార ఉద్యోగులను గుర్తించాలి

ABN , First Publish Date - 2022-08-10T06:15:09+05:30 IST

ప్రభుత్వాలు సహకార ఉద్యోగులను గుర్తించాలి

ప్రభుత్వాలు సహకార ఉద్యోగులను గుర్తించాలి
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

చేవెళ్ల, ఆగస్టు 9: సహకార బ్యాంకు ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీని వెంటనే అమలు చేయాలని పీఏసీఎస్‌ ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం చేవెళ్లలో సంఘం సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పి.ఈశ్వర్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు గణేశ్‌ మాట్లాడుతూ.. రైతులకు రుణాలు ఇవ్వాలంటే అనేక ఇబ్బందులు ఎదురువుతున్నాయని వాపోయారు. జిల్లా ఉన్నత స్థాయి పైఅధికారుల నియామకంతో జిల్లాల్లో సీఈవోలపై పనిభారం పెరిగిందన్నారు. కోఆపరేటివ్‌ ఉద్యోగులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలని కోరారు. సహకార బ్యాంకుల సిబ్బందికి ప్రభుత్వపరంగా గుర్తింపు లేదని, దీంతో ఉద్యోగులు అన్ని సౌకర్యాలను కోల్పోతున్నారని వాపోయారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జంగయ్య, సమన్వయకర్త ఈశ్వరప్ప, సీఈవోలు వెంకటయ్య, శంకరయ్య, రాజలింగం, మనోహర్‌, రాంరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T06:15:09+05:30 IST