రైతు సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వాలు: రమేష్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-05-26T06:16:03+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచి కార్పొరేట్‌ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నాయని టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి విమర్శించారు

రైతు సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వాలు: రమేష్‌రెడ్డి
సోలిపేటలో వరంగల్‌ డిక్లరేషన్‌ను రైతుకు చదివి వినిపిస్తున్న పటేల్‌ రమేష్‌రెడ్డి

సూర్యాపేటరూరల్‌, మే 25 :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచి కార్పొరేట్‌ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నాయని టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి విమర్శించారు. బుధవారం మండలంలోని సోలిపేట గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ హయంలోనే రైతులు సంతోషంగా ఉన్నారని, తెరాస పాలనలో రైతులకు కన్నీరే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధాన్యం విక్రయానికి రైతులు నానాతంటాలు పడాల్సి వస్తోందని ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ రైతు డిక్లరేషన్‌ను చదివి వినిపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు గట్టు శ్రీనివా్‌చ, ముదిరెడ్డి రమణారెడ్డి, పాలవరపువేణు, దరవత్‌ వెంకన్న, రమేష్‌ నాయుడు,  దేవెందర్‌, దర్మ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T06:16:03+05:30 IST