మాట్లాడుతున్న బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నీలకంటేశ్వర్రావు
మందమర్రి టౌన్, మార్చి 27: బీసీలను ప్రభుత్వాలు అణగదొక్కుతున్నా యని, రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ సం ఘం జిల్లా అధ్యక్షుడు నీలకంఠేశ్వర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మందమర్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ జనగణన చేయాలని, జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని పేర్కొన్నా పట్టించుకోవడం లేదన్నారు. ఓబీసీ రిజర్వేషన్లు అడగకముందే ప్రధాని మోదీ అమలు చేశారని, కాని బీసీలకు ఎందుకు చేయడం లేదని మండిపడ్డారు. బీసీలకు అధికారంలోకి వస్తే పది శాతం లేని అగ్రకులాలు రాజ్యాధికారానికి దూరమవుతారనే యోచనతోనే రిజర్వేషన్ల అమలుకు మొగ్గు చూపడం లేదన్నారు. 2024 నాటికి బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించి అన్ని కమిటీలు ఏర్పాటు చేసి రిజర్వేషన్ల సాధనకు పోరాడుతామని పేర్కొ న్నారు. నాయకులు వెంకటేష్, ఉమామహేశ్వర్రావు, చీర్ల సత్యం, శ్రీనివాస్, గడికొప్పుల రవీందర్, శంకర్, అంజి, తాజోద్దీన్, కొప్పు సాయి పాల్గొన్నారు.