Advertisement

గవర్నర్‌ ఆమోదం.. రాజ్యంగ విరుద్ధం

Aug 1 2020 @ 04:45AM

వియనగరం:  సీఆర్‌డీఏ బిల్లు రద్దు, మూడు రాజధానుల బిల్లుకు  గవర్నర్‌ ఆమోదం తెలపడం రాజ్యంగ విరుద్ధమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు  శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.  రాష్ట్రపతి అధికార ముద్రతో హైకోర్టు అమరావతిలో ఏర్పడిందని, దీనిని కర్నూలుకు ఎలా తరలి స్తారని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంతో ప్రధాని చేతుల మీదుగా అమ రావతికి శంకుస్థాపన చేశారని,  ఈ పరిస్థితిలో మూడు రాజధానుల బిల్లును గవర్నర్‌ ఎలా ఆమోదిస్తారని అన్నారు. సెలక్ట్‌ కమిటీ ముందు ఈ బిల్లు ఉన్నప్ప టికీ ప్రజా వ్యతిరేకంగా బిల్లులను ఆమోదించారన్నారు.   పరిపాలనా వికేంద్రీ కరణ అంటే స్థానిక సంస్థలకు రాజ్యంగం నిర్దేశించిన హక్కులు, బాధ్యతలు, నిధులు అందించాలే తప్ప ఇలా ఇష్టానుసారంగా రాజధానులను మర్చటం అన్యాయమని తెలిపారు. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.