
విజయవాడ కల్చరల్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాష, సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఆర్.మల్లికార్జునరావు ప్రత్యేక బహుమతి అందజేశారు. గవర్నరుకు ప్రత్యేకంగా వేయించిన ఆయన పెయింటింగ్ చిత్రపటాన్ని బహూకరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో ఈ చిత్రపటాన్ని అందజేశారు.