ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై నెటిజన్ల ఫిర్యాదు.. గవర్నర్ స్పందన..

ABN , First Publish Date - 2020-07-07T02:13:34+05:30 IST

నగరంలోని పలు ఆస్పత్రుల్లో ఖాళీ బెడ్ల వివరాలను తెలియపరిచేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసైని ఓ నెటిజన్ కోరారు. మంగళవారం నాడు రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల

ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై నెటిజన్ల ఫిర్యాదు.. గవర్నర్ స్పందన..

హైదరాబాద్: నగరంలోని పలు ఆస్పత్రుల్లో ఖాళీ బెడ్ల వివరాలను తెలియపరిచేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసైని ఓ నెటిజన్ కోరారు. మంగళవారం నాడు రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమీక్ష జరపనున్నట్లు గవర్నర్ తమిళిసై ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌కి పలువురు నెటిజన్లు స్పందించారు. హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి దారుణంగా ఉందని, లాక్‌డౌన్ విధించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఓ నెటిజన్ గవర్నర్‌ను కోరారు. కరోనా వ్యాప్తి, పరీక్షలు, చికిత్సల విషయంలో చొరవ చూపాలని మరో నెటిజన్ కోరారు. దీనికి స్పందించిన గవర్నర్ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ప్రైవేటు ఆస్పత్రులు ప్రజల రక్తం తాగుతున్నాయని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రోజుకు ఐదారువేల పరీక్షలే జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాలని గవర్నర్‌ను పలువురు కోరారు.

Updated Date - 2020-07-07T02:13:34+05:30 IST