Governor Tamilisai తెలంగాణ వర్శిటీలో విద్యార్థులతో గవర్నర్ తమిళి సై ఇంటరాక్ట్

ABN , First Publish Date - 2022-08-07T21:06:15+05:30 IST

తెలంగాణ వర్శిటీలో విద్యార్థులతో గవర్నర్ తమిళి సై ఇంటరాక్ట్ అయ్యారు.

Governor Tamilisai తెలంగాణ వర్శిటీలో విద్యార్థులతో గవర్నర్ తమిళి సై ఇంటరాక్ట్

నిజామాబాద్ (Nizamabad): తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University)లో విద్యార్థులతో గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) ఇంటరాక్ట్ (Interact) అయ్యారు. అధ్యాపకులు, సిబ్బంది లేరని, కనీస వసతులు వర్శిటీలో లేవని, రవాణా ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. సమస్యలపై గవర్నర్‌కు విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. కరోనా (corona) వచ్చిన విద్యార్థులను పట్టించుకోకుండా.. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టారని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడారని తమిళి సైకు వివరించారు. వీటిపై స్పందించిన గవర్నర్ మాట్లాడుతూ.. ఇక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. పరిశోధనల వైపు విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు. గవర్నర్ మాట్లాడుతుంటే వర్శిటీ పిఆర్వో మధ్యలో కల్పించుకోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.


న్యాక్ (Nyack) పొందేందుకు చేయాల్సిన కృషి వర్శిటీలో జరుగుతున్నట్టు అనిపించడం లేదని గవర్నర్ తమిళి సై అన్నారు. కనీసం ఆడిటోరియంలేని పరిస్థితి ఉందని, క్రీడల్లోనూ వసతులు లేకపోవడం సరి కాదన్నారు. కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత వర్శిటీ మీద ఉందన్నారు. అధ్యాపకులు, సిబ్బంది నియామకాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ నిధుల మీదే కాకుండా పూర్వ విద్యార్థుల సాయంతో వసతులు కల్పించేందుకు కృషి చెయవచ్చునని తమిళి సై అన్నారు.

Updated Date - 2022-08-07T21:06:15+05:30 IST