Governor Tamilisai.. నేను ఒక తల్లిగా ఇక్కడికి వచ్చాను..

ABN , First Publish Date - 2022-08-07T17:54:40+05:30 IST

రాష్ట్రంలో ఎక్కడా ప్రోటోకాల్ అమలు కావడం లేదని గవర్నర్ తమిళి సై అన్నారు.

Governor Tamilisai.. నేను ఒక తల్లిగా ఇక్కడికి వచ్చాను..

నిర్మల్ (Nirmal): గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) ఆదివారం ఉదయం బాసర (Basara) ట్రిపుల్ ఐటీ (Triple IT)కి చేరుకుని క్యాంపస్‌లో కలియతిరిగారు. విద్యా బోధన, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. హాస్టల్ గదులు, వాష్‌ రూంలను పరిశీలించారు. విద్యార్థులు హాస్టల్ సమస్యలతో పాటు అకాడమిక్ సమస్యలను గవర్నర్ దృష్టికి తెచ్చారు. అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ వద్ద గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ప్రోటోకాల్ (Protocol) ఎక్కడా అమలు కావడం లేదన్నారు. తాను ఒక తల్లిగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. విద్యార్థుల సమస్యలను  పరిష్కరించాలని వచ్చానని, ఆహారం విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ట్రిపుల్ ఐటీలో పరిస్థితులు అందరికీ తెలిసినవేనని, సానుకూల దృక్పథంతో  సమస్యలను  పరిష్కరించాలని అధికారులకు సూచించానన్నారు. సెక్యూరిటీ  సమస్యలతో అందరూ ఇబ్బందులు పడుతున్నారని, అధ్యాపకుల భర్తీతో సహా టైమ్ బాండ్ ప్రకారం సమస్యలను  పరిష్కరించాలని, విలువలతో కూడిన విద్య, స్నేహపూర్వక వాతావరణం కలిపించాలని అధికారులకు సూచించినట్లు గవర్నర్ తమిళి సై వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-07T17:54:40+05:30 IST