Bhadradri కొత్తగూడెం జిల్లా: వరద బాధితులను పరామర్శిస్తున్న గవర్నర్ Tamili sai

ABN , First Publish Date - 2022-07-17T16:17:49+05:30 IST

గవర్నర్‌ తమిళిసై (Tamili sai) ఆదివారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు.

Bhadradri కొత్తగూడెం జిల్లా: వరద బాధితులను పరామర్శిస్తున్న గవర్నర్ Tamili sai

భద్రాద్రి (Bhadradri) కొత్తగూడెం జిల్లా: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై (Tamili sai) ఆదివారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా అశ్వాపురం మండలం, బట్టీల గుంపులో వరద బాధితులను పరామర్శిస్తున్నారు. అలాగే పాములపల్లిలో గోదావరి (Godavari) ముంపునకు గురైన ఇండ్లను గవర్నర్ తమిళసై పరిశీలిస్తున్నారు. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని మరీ.. వరద ప్రాంతాల్లో గవర్నర్ పర్యటిస్తున్నారు.


గవర్నర్‌ రైలు మార్గంలో  కొత్తగూడెం చేరుకున్నారు. వరద పరిస్థితుల్ని పరిశీలించడంతోపాటు బాధితుల్ని పరామర్శిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో షెల్టర్‌ క్యాంపులు, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వైద్యం, సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ బృందాలను గవర్నర్‌ ఆదేశించారు. పర్యటనలో భాగంగా షెల్టర్‌ క్యాంపులను గవర్నర్‌ సందర్శించి.. రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఇతర సంస్థల నుంచి సహాయ సామాగ్రిని సమీకరించనున్నారు. 


కాగా ఢిల్లీలో శనివారం జరిగిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీడ్కోలు విందుకు గవర్నర్‌ తమిళి సై హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు షెడ్యూల్‌ కూడా ఖరారైంది. అయితే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో తమిళిసై ఫోన్‌లో మాట్లాడి.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సిన అవసరాన్ని ఆయనకు వివరించారు. 

Updated Date - 2022-07-17T16:17:49+05:30 IST