నిస్వార్థసేవకులు డాక్టర్లు:గవర్నర్ తమిళిసై

Published: Thu, 30 Jun 2022 16:27:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిస్వార్థసేవకులు డాక్టర్లు:గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: రోగులకు నిస్వార్ధంగా, అవిశ్రాంతంగా సేవలు అందించే వారు డాక్టర్లని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. జూలై 1 ‘నేషనల్ డాక్టర్స్ డే’ సందర్భంగా వైద్యులకు ఆమె ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా గవర్నర్ డాక్టర్ల సేవలను కొనియాడారు. కోవిడ్-19 సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా డాక్టర్లు అందించిన సేవలను మరువలేమని చెప్పారు. ఎంతో రిస్క్ తీసుకుని కోవిడ్ రోగులను కాపాడేందుకు వారు పని చేశారని అన్నారు. అదే కమిట్ మెంట్ తో డాక్టర్లు తమ వ`త్తిలో పునరంకితం కావాలని అన్నారు. 


ప్రతి సంవత్సరం జూలై1న డాక్టర్స్ డే గా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ వర్ధంతి,జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నట్టు తెలిపారు. ప్రాణాలను కాపాడే డాక్టర్లను స్మరించుకోవడం, వారి సేవలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత అన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.